ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగాడు.

 Adipurush Director Om Raut Sensational Comments On Prabhas Details, Adi Purush,-TeluguStop.com

ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఈ సినిమా ఇటీవలే విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే.ఇక ప్రస్తుతం ప్రభాస్ తన తర్వాత సినిమాలో అయినా సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

టాలీవుడ్ లో ప్రభాస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో మనందరికి తెలిసిందే.

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే దర్శకుడు ఓం రావత్ ఇటీవల ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

దేశ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్క దర్శకుడు ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి పనిచేయాలని అనుకుంటాడు.సినిమా కోసం తన పాత్ర కోసం ప్రభాస్ ప్రాణాలను కూడా లెక్క చేయడు.

అతనిలోని టాలెంట్ను ప్రతి కోణాన్నీ దర్శకుడు కాబట్టి వెండితెరపై మ్యాజిక్ చేయాలని అనుకుంటారు అని చెప్పుకొచ్చారు దర్శకుడు ఓం రావత్.

Telugu Salaar, Adi Purush, Biggest Prabhas, Om Raut, Nag Ashwin, Prabhas, Prasan

భారతదేశంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు.వారిలో హీరో ప్రభాస్ కూడా ఒకరు.అయితే ప్రభాస్ నటన ఆయన ప్రవర్తన పూర్తిగా విభిన్నమైనది.

దేశంలోనే ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్ అనడానికి ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకొచ్చారు దర్శకుడు ఓం రావత్. దర్శకుడు అంటే ప్రభాస్ కు అత్యంత గౌరవం అని, ఇతరుల పట్ల ప్రభాస్ వ్యక్తిగత ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంటుంది అని, ప్రభాస్ హృదయం లో ఉండే భావాలు కళ్ళల్లో వ్యక్తమవుతాయి అంటూ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తారు.

Telugu Salaar, Adi Purush, Biggest Prabhas, Om Raut, Nag Ashwin, Prabhas, Prasan

ఇకపోతే ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అరవింద ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రభాస్ నటిస్తున్న మరొక సినిమా స్పిరిట్.ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube