అమెరికా సంస్థ షాకింగ్ సర్వే...అత్యధిక జీతాలు పొందేది వారేనట..

అగ్ర రాజ్యం అమెరికాలో ఐటీ , లేదా మరే ఇతర ఉన్నత ఉద్యోగమైనా సరే పొందితే ఆకర్షణీయమైన జీతంతో ఉంటుంది.బహుశా అమెరికాలో ఉద్యోగులకు ఇచ్చేంత జీతాలు మరే ఇతర దేశాలు ఇవ్వకపోవచ్చు.

 American Company Shocking Survey They Are The Highest Paid, America, H-1b Visa,-TeluguStop.com

అందుకే అమెరికాలో ఉద్యోగం కోసం ఎంతో మంది పోటీ పడుతుంటారు, వేలాది మంది ఇతర దేశాల నుంచీ అమెరికాకు వలస వెళ్తుంటారు.అయితే ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన ఓ సంస్థ అసలు అమెరికాలో ఉద్యోగం చేసే వారిలో ఎవరికీ అత్యధిక జీతం ఉంటుంది స్థానికులకా లేదా వలస వచ్చిన వారికా అనే సర్వే చేపట్టింది.

ఈ సర్వే రిజల్స్ చూసి ఔనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అమెరికన్స్.ఇంతకీ ఈ సర్వే ఏం చెప్పిందంటే.

అమెరికాలో అత్యధిక స్థాయిలో జీతాలు తీసుకుంటున్న వారిలో అగ్ర స్థానం హెచ్ –1బి వీసా దారులదేనట.అమెరికాలో అధిక జీతం తీసుకుంటున్న వారిలో తొలి 10 శాతం మందిని లెక్క గట్టగా అందులో హెచ్ -1 బి వీసా దారులు ఉన్నట్టుగా కాటో అనే సర్వే సంస్థ వెల్లడించింది.

అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం చూస్తే 2021 లో హెచ్ –1బి వీసా

దారుల సగటు వేతనం 108000డాలర్లు ఉందని అదే సమయంలో అమెరికాలో మొత్తం ఉద్యోగుల వేతనం 45760 డాలర్లు ఉందని అంటే హెచ్ –1బి వీసా వీసా వారి ఆదాయం మిగిలిన వారితో పోల్చితే రెండు రెట్లు అధికంగా ఉందని తెలిపింది.ఇదిలాఉంటే

Telugu America, Visa, Indian, Indian Nris, Job America-Telugu NRI

ఇతర ఉద్యోగుల వేతనాల పెరుగుదల కంటే కూడా హెచ్ –1బి వీసా దారుల వేతనాల పెరుగుదలలో భారీ వ్యత్యాసం ఉందని కాటో తన సర్వేలో తేల్చి చెప్పింది.కాగా హెచ్ –1బి వీసా కలిగిన ఉద్యోగులలో అత్యధికులు భారతీయులే కావడం ఇక్కడ మరొక విషయం. భారతీయ ఎన్నారైల జీతాల పెరుగుదల రెట్టింపు అవ్వడానికి వారి ప్రతిభాపాటవాలే అందుకు కారణమని అందుకే అక్కడి కంపెనీలు సైతం భారత్ నుంచీ వచ్చే నిపుణులకె అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube