హ్యాపీ డేస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారి వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నిఖిల్.యువ హీరోలందరి లో కూడా కాస్త ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక కథల ఎంపికలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ నిఖిల్ ఏదైనా సినిమా చేస్తున్నారంటే అది మంచి సినిమానే అయి ఉంటుంది అని ప్రేక్షకులు అనుకునే విధంగా చేశాడు.కానీ గత కొంతకాలంగా మాత్రం నిఖిల్ కి బాగా బ్యాడ్ టైం నడుస్తుంది అన్నది తెలుస్తుంది.
వరుసగా ఫ్లాపులు తర్వాత కరోనా బ్రేకులు ఎన్నో అవాంతరాలు అయినప్పటికీ పట్టు విడువని విక్రమార్కుడిలా నిఖిల్ మాత్రమే ఇక సరైన సక్సెస్ కోసం గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నాడు.ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
కరెక్టుగా చెప్పాలంటే 2014లో రిలీజ్ అయిన కార్తికేయ తర్వాత కొన్నాళ్ళపాటు ఫ్లాప్ లు.ఇక ఆ తర్వాత 2016 లో రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ కొట్టాడు.కానీ ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు.మధ్యలో అర్జున్ సురవరం అనే సినిమాతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కమర్షియల్ గా లాభాలు మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది.ఇప్పుడు తన హిట్ మూవీ కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా జూలై 22 వ తేదీన విడుదల చేస్తామని డేట్ కూడా లాక్ చేసేసాడు.

ఇక మరో సినిమా 18 పేజెస్ లాంటి డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.డైరెక్టర్ సుకుమార్ రాసిన కథను ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తు ఉండటం గమనార్హం.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సుకుమార్ రైటింగ్స్ కంబైన్డ్ గా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు.
ఇక ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తాయని ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాడు నిఖిల్.ఇక ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని ఆశపడుతున్నాడు.
ఇక హీరో లు ఎన్ని ఆశలు పెట్టుకున్న తుది తీర్పు ఇచ్చేది మాత్రం ప్రేక్షకులే కదా.ఏం జరుగుతుందో చూడాలి మరి.







