బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ వార్త ఏదైనా ఉందా అని అంటే అది అలియా భట్ రణబీర్ కపూర్ వెడ్డింగ్ అనే చెప్పాలి.స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేయనుంది.
ఇప్పుడు ఈమె పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వీరి పెళ్లి ఈ నెలలోనే జరగ బోతుంది అని నెట్టింట టాక్ వినిపిస్తుంది.వీరి ఫ్యాన్స్ వీరి వివాహం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జంట పెళ్లితో ఒక్కటి అవ్వాలని సెలెబ్రిటీలు సైతం కోరుకుంటున్నారు.అందుకే బాలీవుడ్ ప్రేక్షకులు వరుసగా వీరికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఇప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ అలియా, రణబీర్ లకు వీడియో ఆల్ లో విషెష్ చెప్పిన విషయం విదితమే.తాజాగా మరొక స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా విషెష్ తెలిపాడు.సంజయ్ సత్ బయోపిక్ సంజు లో రణబీర్ నటించాడు సంజయ్ లా రణబీర్ నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది.తాజాగా సంజయ్ విషెష్ చెబుతూ అలియా, రణబీర్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది.పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు నమ్మకంతో.ఎన్ని కష్టాలు వచ్చిన ఒకరికొకరు తోడుగా ఉంటామని, ఒకరికోసం ఒకరు కలిసి ఉంటామని చేసుకునే ఒక ప్రామిస్.ఈ జంట ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.అలియా త్వరగా పిల్లలను కూడా కనేయాలి.అంటూ చెప్పుకొచ్చారు.
ప్రెసెంట్ సంజయ్ దత్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే ఈ పెళ్లి వచ్చే వారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని డేట్ మార్చుకున్నారని చెబుతున్నారు.