ధాన్యం కొనడం చేత కాకుంటే దిగిపోండి:- కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి పైర్

రాష్ట్రంలో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు,ధాన్యం కొనుగోలు చేయడం చేతకాదని చేతులెత్తేసి ధర్నాలు చేయడం సరికాదని, పరిపాలన చేయడం చేత కాకుంటే దిగిపోవాలని టిఆర్ఎస్ సర్కార్ పై భట్టి ఫైర్ అయ్యారు.ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 18వ రోజు బోనకల్ మండలం గార్లపాడు, లక్ష్మీపురం, గోవిందాపురం, పెద్ద బీరవల్లి, జానకీపురం గ్రామాల్లో పీపుల్స్ మార్చ్ కొనసాగింది.

 Get Down If Not By Buying Grain: - Clp Leader Bhatti Pier On Kcr-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడారు.ధాన్యం కొనడం టీఆర్ఎస్ కు చేతకాదని దిగిపోతే… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సమర్థవంతమైన పరిపాలన చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొనుగోలు చేయకపోవడం వివక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు.దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా అంతర్భాగం అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోవద్దని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శించే వివక్షత వల్ల జాతి సమైక్యతకు విఘాతం కలుగుతుందని హెచ్చరించారు.కేంద్రం చూపించే వివక్ష జాతి విచ్ఛిన్నానికి దారి తీసే ప్రమాదం ఉందని అన్నారు.

కేంద్రం ధాన్యం కొంటదా? లేదా? తర్వాత తేల్చుకోవాలని, రైతులను ఆందోళనకు గురి చేయకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని కోరారు.ఇప్పటికే నకిలీ విత్తనాలతో సరైన దిగుబడి రాక ఆందోళన చెందుతున్న రైతాంగానికి మద్దతు ధర కూడా కరువై, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మానసిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.

రైతులు మానసిక స్థైర్యం కోల్పోయిన తర్వాత జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటన చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏకంచేసి రైతు ఉద్యమాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమస్ఫూర్తితో వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుతామని తెలిపారు.నవభారత నిర్మాత ప్రధాని నెహ్రూ అనేక ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నిర్మించారని వివరించారు.

వాటి ద్వారా పారే నీటితో పండించిన ధాన్యంతో గత 75 సంవత్సరాలుగా దేశంలో ఆకలి చావులు లేకుండా ఉన్న విషయాన్ని ఇప్పటి పాలకులు మర్చిపోవద్దని సూచించారు.తినటానికి తిండి లేక ఆకలి చావులతో అలమటించచిన దేశంలో ఇప్పుడు ఆహారధాన్యాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే కారణమన్నారు.

పంటలు పండించడం రైతుల హక్కు అని, రైతులు పండించిన పంటలను కొనాల్సి బాధ్యత సర్కారుదని స్పష్టం చేశారు.కొనుగోలు బాధ్యతలు విస్మరించి రాజకీయ అవసరాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube