ఏపి సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

ఏపి సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నాకు సీఎం ఇంత మంచి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది.ఈ మూడు శాఖలు కేటాయించి నాపై సీఎం మరింత బాధ్యత పెంచారు.

 Srinivasa Venugopalakrishna Who Took Charge As A Minister In The Ap Secretariat-TeluguStop.com

నేను సీఎంకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.పాత్రికేయుల మిత్రుల కష్టనష్టాల గురించి నాకు మంచి అవగహన ఉంది.

పాత్రికేయులకు ఉన్న సమస్యలను ఎప్పటికీ అప్పుడు సీఎం దృష్టికి తీసుకొని వెళుతాను.పాత్రికేయుల సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేస్తాను.

బీసీల కోసం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సామజిక విప్లవం సృష్టించారు.మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆశయలతో సీఎం పాలన కొనసాగిస్తున్నారు.బీసిలకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఓ సువర్ణ యుగం నడుస్తుంది.సీఎంకు ఎంతో ఇష్టమైన బీసీ శాఖను నాకు అప్పగించడం.

మరోసారి నాకు ఈ శాఖ కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది.రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదులోనే సినీపరిశ్రమ ఉండిపోయింది.

సినీపరిశ్రమకు మన రాష్ట్రంలో సహయసహకారాలు అందించేందుకు సీఎం ఎంతో సానుకూలంగా ఉన్నారు.సినిమా షూటింగ్ లు చేసుకోవడానికి మన రాష్ట్రంలో మంచి లోకేషన్స్ ,వనరులు ఉన్నాయి.

ఇక్కడే షూటింగ్ లు జరిగే విధంగా ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలు అందించడానికి సిద్దంగా ఉంది.సినీపరిశ్రమ కూడా సినిమా షూటింగ్ లు, స్టూడియో లు స్థాపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలో జరిగే సంక్షేమ పాలనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు.

అలాంటి కుట్రలను కట్టడి చేయాల్సిన బాధ్యత నాపై‌ ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube