'జీ సూపర్ ఫామిలీ' అనే క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో తో ఈ నెల 17న మన ముందుకి వస్తుంది జీ తెలుగు

ఎప్పుడూ అందరిని ఆహ్లదంగా ఉంచడానికి చూసే జీ తెలుగు, ఈ ఆదివారం నుంచి అందరికి మరిన్ని సంబరాలని అందివ్వడానికి ‘జీ సూపర్ ఫామిలీ’ అనే క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో తో తన అభిమానుల ముందరికి వస్తుంది ఈ ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటలకు.ప్రత్యేకతకి మరో పేరు జీ తెలుగు, అందుకే మెగా లాంచ్ ని మరింత వైభవంగా మార్చడానికి డీజే టిల్లు ఫేమ్ సిద్దు మరియు నటుడు నిఖిల్ వారి మాతృమూర్తి తో షో కి విచ్చేశారు.

 Zee Telugu Is Coming To Us On The 17th Of This Month With The Craziest Family S-TeluguStop.com

సిద్ధూ తన సినిమా టైటిల్ సాంగ్ మీద డాన్స్ చేసి అందర్నీ అబ్బురపరిస్తే, నిఖిల్ ‘వంద స్పీడ్ లో వస్తున్న’ అనే పాట మీద డాన్స్ చేసి అందరి ఉత్తేజాన్ని మరింత పెంచారు.ఈ షో కి ఇంకాస్త సంబరాన్ని అంటిస్తూ, తెలుగు వారి ఆడపడుచు సుమ కనకాల విచ్చేశారు.

అంతేనా, తన మరియు జీ తెలుగు అభిమానుల కోసం ఒక రాప్ సాంగ్ ని పాడి అందరిని ఆశ్చర్యపరిచారు.

ధారావాహికల మధ్య సాగే రసవత్తరమైన పోరులో దేవతలారా దీవించండి , రౌడీ గారి పెళ్ళాం, ముత్యమంతా ముద్దు, ఊహలు గుసగుసలాడే, గుండమ్మ కథ, ఇంటి గుట్టు, మిఠాయి కొట్టు చిటమ్మ, వైదేహి పరిణయం, కళ్యాణ వైభోగం, కృష్ణ తులసి, రాధమ్మ కూతురు, కళ్యాణం కమనీయం, నెంబర్ 1 కోడలు, త్రినయని, ప్రేమ ఎంత మధురం, అగ్నిపరీక్ష మరియు సూర్యకాంతం పాల్గొనగా, వారితో పాటు సూపర్ క్వీన్, స రి గ మ ప – ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ మరియు స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్స్ యొక్క పార్టిసిపంట్స్ కూడా పాల్గొంటున్నారు.

అందరూ గెలుచుకోవాలని చూసేది ‘జీ సూపర్ ఫామిలీ’ యొక్క క్రేజీఎస్ట్ టైటిల్.ఇంతటి ఘన షో కి యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరించంగా, పార్టిసిపెంట్స్ స్ఫూర్తి, సహనం మరియు క్రేజీఎస్ట్ టైటిల్ గెలువాలనే పట్టుదల ఈ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube