అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తున్నారు:- ప్రజావాణిలో గ్రామస్తులు పిర్యాదు

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండా గ్రామంలో అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారని, ఖమ్మం జడ్పి హాల్ లో జరిగిన ప్రజా వాణిలో జాయింట్ కలెక్టర్ కి గ్రామస్తులు వినతిపత్రం ద్వారా పిర్యాదు చేశారు.గ్రామంలో ఇరవై డబుల్ బెడ్ రూమ్ లు గృహము నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఎంపికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

 Allocating Double Bedrooms To The Ineligible: - Villagers Complain In Public-TeluguStop.com

ఎంపీకలో భాగంగా స్థానిక మండల, నియోజకవర్గ రెవిన్యూ అధికారులు పలురకాల జాబితాలు విడుదల చేస్తూ అనుకూల అనుచరులకు, ఇప్పటికే భూములు నివాస గృహములు కల్గి ఉన్నా వారి పేర్లను జాబితాలో చేర్చి, పలు విధాలుగా జాబితాలు వీధుల చేస్తూ, ప్రజా ప్రతినిధులకు తక్కువ సమయంలో సమాచారం అందించి,స్థానిక గ్రామ ప్రథమ పౌరులు అయినా మాకు కూడా ఎటువంటి ఆహ్వానo అందించలేదు అంటూ జిల్లా కలెక్టర్ కి గ్రామ సర్పంచ్ ప్రసాద్ పిర్యాదు చేశారు.రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా సొంతంగా ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం, లాటరీలు తీసి ప్రశ్నించిన గ్రామస్తులను, స్థానిక గ్రామ సర్పంచ్ ని లోపల వేయండి అంటూ రెవిన్యూ అధికారులు అదేసించడం హుకుం జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ నిజమైన లబ్ధిదారులను గుర్తించి అందరి సమక్షంలో మళ్ళీ లబ్ధిదారులను నిర్ణయిoచాలి అంటూ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ కి పిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు ప్రసాద్,G సర్దార్ బాబు,M మోహన్ రావు,T శ్రీను, M బాలాజీ,B మోహన్ గాంధీ,B మాoగ్యా, J మోతి లాల్,L సురేష్,J లింగా,B వినయ్,N నరసింహ,పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube