మరో రెండు సంచలనమైన నిజాయితీ గల కథలను వెండితెరపై చూపించబోతున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్‌

కశ్మీర్ ఫైల్స్‘ చిత్రంతో తో పాన్ వరల్డ్ విజయాన్ని అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్‌ మానవ చరిత్రకు సంబంధించిన మరో రెండు గొప్ప నిజాయితీ కథలను వెండితెరపై చూపించబోతున్నారు.వీరి కాంబినేషన్‌లో విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్‘  దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ప్రపంచ సినిమాని ఆకర్షించింది.1990లో కాశ్మీరీ పండిట్‌లు ఎదురుకున్న నాటి పరిస్థితులని హృదయాన్ని కదిలించేలా తెరపై ఆవిష్కరించారు.నిజాయితీ చెప్పిన ఈ కథ కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది.ఇప్పుడు అంతే నిజాయితీతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరో రెండు నిజాయితీ గల కథలు వెండితెరపై చూపించాలని సంకల్పించారు.

 Abhishek Agarwal Arts & I Am Buddha Production To Reunite To Tell 2 More Brutall-TeluguStop.com

250 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ ప్రదర్శింపబడుతుంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఈ చిత్రాన్ని అభినందించారు.

దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది.ఈ చిత్రాలకు సంబధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube