కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన మాండలిజ్ ఇండియా

ఏప్రిల్ 11 2022: భారతదేశంలో కోవిడ్ ఉపశమన ప్రయత్నాలను పటిష్ఠం చేసేందుకు తన వం తు మద్దతుగా మాండలిజ్ ఇండియా శుభ్ ఆరంభ్ – కోవిడి వ్యాక్సినేషన్ డ్రైవ్ తదుపరి దశను ప్రారంభించిం ది.వైద్య ఉపకరణాలు అందించడానికి తోడుగా, 5 లక్షల టీకా డోసులు అందించేందుకు కూడా కంపెనీ వాగ్దానం చేసింది.వీటిలో ఇప్పటికే 3.75 లక్షల డోసులను సంస్థ ఫ్యాక్టరీలు ఉన్న మధ్యప్రదేశ్ (గోహద్), హి మాచల్ ప్రదేశ్ (నాలాగఢ్), మహారాష్ట్ర (మవల్, పుణె), ఆంధ్రప్రదేశ్ (శ్రీ సిటీ)లలో అందించింది.

 Mondelez India Launches Covid-19 Vaccination Drive In Select Locations , Madhya-TeluguStop.com

సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన వారు కోవిడ్ -19 టీకాలను సులభంగా పొందేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కంపెనీ సేవ్ ది చిల్డ్రన్ ఎన్జీవోతో భాగస్వామిగా మారింది.ఇది స్థానిక ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలతో కలసి ఇంటింటికి వెళ్తూ విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తుంది.

ప్రజలకు టీకాలపై అ వగాహన కల్పిస్తుంది, అపోహలను దూరం చేస్తుంది.టీకా కవరేజ్ ను మెరుగుపరుస్తుంది.

ఈ ప్రయత్నాలపై మాండలిజ్ ఇంటర్నేషనల్ సీనియర్ డైరెక్టర్ (కార్పొరెట్ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ – సీజీఏ), ఇండియా & సీజీఏ లీడ్, ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఒఫిరా భాటియా మాట్లాడుతూ ‘‘దేశం కోవిడ్ -19 నుంచి కోలుకునే దశల్లో ఉంది.దేశంలోని ప్రతి ఒక్కరూ సకాలంలో టీకాలు వేయించుకున్నపుడే ఈ విషయంలో మనం సాధించిన ప్రగతి నిలబడగలుగుతుందనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం.

దీన్ని దృష్టిలో ఉంచుకొని, దేశంలో ఆరోగ్య మౌలిక వసతులు పెంచేందుకు, అందరికీ టీకాలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మేం చేపట్టిన టీకా డ్రైవ్ కూడా అండగా నిలుస్తుందని భావిస్తున్నాం.మా పర్పస్ ఆఫ్ జర్నీలో ప్రజలు, భూగ్రహం సంక్షేమమే కీలకం.

కోవిడ్ పై చేస్తున్న పోరాటంలో భారతదేశానికి మా నిరంతర మద్దతు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube