సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్దతు ధర ఇచ్చే వరకు పోరాటం చేస్తామని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్షను ఆదివారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు.దీక్షలో కూర్చున్న పటేల్ రమేష్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా కాంగ్రేస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.శాంతియుతంగా రైతుల కోసం దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని కాంగ్రేస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.
అధికార పార్టీ వారు దీక్షలు చేస్తే రక్షణ కల్పించే పోలీసులు,ప్రతిపక్షాలు దీక్షలు చేస్తే అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేక రాజరిక వ్యవస్థ నడుస్తుందా అర్థం కావడం లేదని మండిపడ్డారు.
రైతులకు మద్దతు ధర ఇచ్చే వరకు కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.