పాకిస్తాన్ లో రాజకీయ పరిస్థితులు అనుకోని విధంగా తారుమారయ్యాయి.గత నెల రోజులుగా సాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎన్నాళ్లకు తెరపడింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆ పదవి విముక్తుడు అయ్యాడు.శనివారం రోజు జరిగిన అనేక వాయిదాల మధ్య సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను తొలగించడం జరిగింది.
ఇదిలా ఉండగా పాకిస్థాన్ చరిత్రలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా ఇలా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలివడం గమనార్హం.ఆదివారం తెల్లవారు ఝామున జరిగిన ఓటింగ్‌లో విపక్షాలన్నీ ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఓటు వేసాయి.
పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా మెజార్టీకి అవసరమైన బలం 172 సభ్యులు.కానీ ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఆయాజ్ సాదిఖ్ ప్రకటించారు.
ఈ అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 3న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సమావేశం జరిగినా డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం పదిన్నర గంటలకు మరోసారి భేటీ అయింది.ఆ తరువాత సభ మధ్యాహ్నం 12.30 వరకు మరోసారి వాయిదా పడింది.తదనంతరం 3 గంటల వరకు ఒకసారి, ఆ తరువాత రాత్రి 8గంటల వరకు మరోసారి వాయిదా పడి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వాయిదా పడుతూ వచ్చింది.
ఆ తర్వాత ఓటింగ్ జరిగింది.<అయితే ఓటింగ్ జరిగే సమయంలో సభలో ఇమ్రాన్ లేరు.ఓటింగ్ సమయంలో ఇమ్రాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.ఓటింగ్‌లో పదవి కోల్పోవడం ఖాయం అని గమనించిన ఇమ్రాన్ ఓటింగ్ కు ముందే తన అధికారిక నివాసం ఖాళీ చేసి వెళ్లిపోయారు.
కాగా తన పదవిని కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేస్తానని తెలిపిన ఇమ్రాన్ చివరివరకు చాలా పోరాడారు.కానీ ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

శనివారం రాత్రి కీలక మంత్రివర్గ భేటీ నిర్వహించగా అందులో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ అధినేత ఆయనతో భేటీ అయ్యారు.ఆ తర్వాత పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్, డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరీ రాజీనామా చేశారు.అనంతరం ప్యానెల్ ఛైర్మన్ ఆయాజ్ సిద్దిఖ్ స్పీకర్ బాధ్యతలు చేపట్టి ఆయనే ఓటింగ్‌ను నిర్వహించారు.కాగా ఇప్పుడు ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న తదుపరి ప్రధాని ఎవరు అని… అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అభ్యర్ధి షెహబాజ్ షరీఫ్ పేరు బాగా వినిపిస్తుంది.
తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఆయనకే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.పాక్ ప్రభుత్వానికి కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పాక్ జాతీయ అసెంబ్లీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నట్లు తెలుస్తుంది.







