ఒకప్పుడు సినిమాలు సక్సెస్ అవ్వాలి అంటే అది బాగా అనుభవం ఉన్న డైరెక్టర్ ల వల్ల మాత్రమే అవుతుంది అని అభిప్రాయపడేవారు.కానీ ప్రస్తుతం మాత్రం యంగ్ డైరెక్టర్ లు సైతం బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్నారు.
హీరోలు కూడా కంటెంట్ వుండాలే కానీ కొత్త డైరెక్టర్ అయినా పర్లేదు అని అనుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు సైతం కొత్త కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారు.
మరి కొత్త కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్న హీరోలెవరు ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది రవితేజ నటిస్తున్న 68వ సినిమా.ఇందులో రవితేజ ఒక సర్వెంట్ క్యారెక్టర్ లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.అయితే ఈ సినిమాను శరత్ మండవ అనే ఒక కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.మరొక టాలీవుడ్ హీరో నాని కూడా కొత్త దర్శకులతో తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.
కొత్త దర్శకుడు అయినా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని దసరా అనే ఒక టైటిల్ తో సినిమాను మొదలు పెట్టారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యింది.
కెరీర్ మొదట్లో సినిమాల విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయని కళ్యాణ్ రామ్ మొదటిసారి యంగ్ డైరెక్టర్ అయినా వశిష్ఠ మల్లిడి కొత్త డైరెక్టర్ తో టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ అనే సినిమాలో నటిస్తున్నాడు.

టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కార్తీక్ అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో మిస్టిక్ టెల్లర్ అనే ఒక కొత్త సినిమాను చేయబోతున్నారు.మనకు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సైతం కార్తీక్ అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో తమిళ్ బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కబోతోంది.అలాగే హీరో నాగశౌర్య కూడా కొత్త డైరెక్టర్ అయిన పవన్ బసం శెట్టిని కొత్త డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నాడు నాగశౌర్య.
అదేవిధంగా వైష్ణవ్ తేజ్ గిరీశయ్య అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే సినిమా చేస్తున్నాడు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.







