ఆర్మ్‌డ్ ఫోర్స్ యాచ్ క్లబ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ.అక్కడి 6,800 డాలర్ల డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకునేందుకు గాను భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్టు గురువారం 15 నెలల జైలు శిక్ష విధించింది.
నిందితురాలిని 42 ఏళ్ల జై చిత్రా సన్ముగ్వాలేగా గుర్తించారు.ఈ మేరకు ఛానెల్ న్యూస్ ఏసియా కథనాన్ని ప్రసారం చేసింది.
నమ్మక ద్రోహం, మోసం వంటి అభియోగాలపై ఆమె నేరాన్ని అంగీకరించింది.వీటితోపాటు సింగపూర్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (ఎస్ఏఎఫ్) యాచ్ క్లబ్ హెచ్‌ఆర్‌తో తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని అబద్ధం చెప్పడంతో పాటు కోడలి నుంచి 350 సింగపూర్ డాలర్ల దొంగతనం చేసిన కేసుల్లో కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి వుంది.
అక్టోబర్ 2020లో ఎస్ఏఎఫ్ యాచ్ క్లబ్‌లో పనిచేయడానికి జైచిత్రను నియమించారు.ఆఫీసు ఫ్రంట్ ఆఫీస్ డెస్క్‌ను నిర్వహించడం, నగదు చెల్లింపులు స్వీకరించడం ఆమె విధి.నవంబర్ 29, 2020న పవర్ బోట్ లైసెన్స్ కోర్స్ కోసం కస్టమర్ నుంచి 235 సింగపూర్ డాలర్ల నగదును స్వీకరించారు.అయితే ఆ డబ్బుకు సంబంధించిన వివరాలను ఈ కోర్సు కోసం పాల్గొనేవారి జాబితాలో ఆమె అప్‌డేట్ చేయలేదు.
ఆ రోజు రాత్రి విధులు ముగిసిన తర్వాత జై చిత్ర 6,635 సింగపూర్ డాలర్లను తీసుకుని ఇంటికి వెళ్లింది.మరుసటి రోజు ఆమె సహోద్యోగి నగదు పోయినట్లు గుర్తించడంతో దొంగతనం జరిగినట్లు తేలింది.
ఇక మరో కేసులో.డిసెంబర్ 2020లో జై చిత్ర తన కోడలు ఫ్లాట్ కొనుగోలు చేయడంలో సాయం చేసిందని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో తెలిపారు.జై చిత్రకు ఇలాంటి విషయాల్లో ఎక్కువ అనుభవం వుందని కోడలు గ్రహించింది.అందువల్ల ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించిన కొన్ని వ్యవహరాలను జైచిత్ర చూసేందుకు ఆమె అంగీకరించింది.
అయితే తన తరుపున ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయడానికి, అద్దె వసూలు చేయడానికి చిత్రకు ఆమె కోడలు ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలేదు.ఈ క్రమంలో కోడలు ఒక కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసి.
డిసెంబర్ 2020లో ఒప్పందంపై సంతకం చేసింది.అయితే ఏప్రిల్ 2021లో అమ్మకందారుడు తాను కొత్త ఫ్లాట్‌ను వెతుక్కోవడానికి మరింత సమయం కావాలని చెప్పాడు.

దీని గురించి చర్చించడానికి జైచిత్ర ప్రాపర్టీ ఏజెంట్‌ను కలిశారు.అయితే 1200 సింగపూర్ డాలర్లు ఇచ్చి ఫ్లాట్‌లో వుండొచ్చని.ముందు 1000 సింగపూర్ డాలర్లు బదిలీ చేయాలని చిత్ర ఏజెంట్‌కి చెప్పింది.దీనికి సమ్మతించిన ఏజెంట్ కొన్ని డాక్యుమెంట్స్‌పై చిత్ర సంతకం తీసుకున్నాడు.తర్వాత జైచిత్ర గతేడాది మే 29న ఫ్లాట్‌ని తనిఖీ చేసి విక్రేత చెల్లించాల్సిన మిగిలిన 200 సింగపూర్ డాలర్ల అద్దెను తీసుకుని, తన కోడలి పేరు మీద సంతకం చేసింది.జరిగినదంతా ఏజెంట్ … కోడలికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో జైచిత్ర .అద్దె సొమ్ము మొత్తాన్ని చెల్లించింది.కానీ ఆర్మీ క్లబ్‌లో దొంగతనం చేసిన డబ్బును మాత్రం చెల్లించలేదు.







