ప్రముఖ యాంకర్, నటుడు సుడిగాలి సుధీర్ కు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రష్మీ సుధీర్ జోడీ కలిసి స్కిట్లు చేసినా ఈవెంట్లు చేసినా అంచనాలకు మించి రేటింగ్స్ వస్తున్నాయి.
సుధీర్ ఏ షో చేసినా ఆ షో దాదాపుగా హిట్ కావడంతో సుధీర్ కు అవకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా మా నాన్నకు పెళ్లి అంటూ ఈ వారం షోను మరింత స్పెషల్ గా క్రియేట్ చేశారు.
ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ తండ్రి పెళ్లికొడుకు గెటప్ లో దర్శనమిచ్చారు.సుధీర్ బుల్లెట్ భాస్కర్ తండ్రితో మీరు పెళ్లి కొడుకా అని అడగగా బుల్లెట్ భాస్కర్ తండ్రి కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ కామెంట్లు చేశారు.
మీకు పెళ్లేంటండి అని సుధీర్ అడగగా మీరు ఈవెంట్లలో డజన్ల కొద్దీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని నేనొక పెళ్లి చేసుకుంటే తప్పా అంటూ ఆయన రివర్స్ లో ప్రశ్నించారు.
రామ్ ప్రసాద్ అప్పటి వయస్సులో లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడగగా అప్పుడు ఉంటాయంటూ బుల్లెట్ భాస్కర్ తండ్రి బదులిచ్చారు.

హైపర్ ఆది రోహిణిని చూపించి పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయి ఓకేనా అని అడగగా బుల్లెట్ భాస్కర్ తండ్రి చీఛీ అని చెబుతాడు.రోహిణి ఫాదర్ షోకు రాగా తండ్రిని చూసి ఆమె ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ తండ్రి మీ ఫాదర్ తో మాట్లాడానని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడగమన్నాడని సుధీర్ ను అడిగారు.

ఆ ప్రశ్నకు సుధీర్ స్పందిస్తూ ఇంతమంది ఫాదర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ షోలో తన పెళ్లికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నానని సుధీర్ వెల్లడించారు.అయితే సుధీర్ మనస్సులో ఉన్న అమ్మాయి ఎవరో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.







