తృటిలో పెద్ద పెను ప్రమాదం తప్పింది.రన్ వేపై ఓ కార్గో విమానం రెండు ముక్కలైంది.
జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం డీహెచ్ఎల్ కు చెందిన బోయింగ్ 757 చెందిన విమానం శాన్‌జోస్‌కు సమీపంలోని జువాన్ శాంటా మారియా అంతర్జాతీయ వినాశ్రయం నుంచి ఉదయం 10 గంటల 05 నిమిషాలకు బయలుదేరింది.బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
టేకాఫ్ అయిన 25 నిమిషాల్లోనే పైలెట్లు ఎమర్జెనీ ల్యాండింగ్ కోసం ఎయిర్‌పోర్ట్ అనుమతి కోరారు.వారీ అంగీకరించడంతో 10.30 గంటలకు విమానం రన్‌వే పైకి తిరిగి వెనక్కి వచ్చేసింది.
అత్యసవర ల్యాండింగ్ సమయంలో రన్ వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత పట్టుకోల్పోయి పక్కకు వెళ్లిపోయి రెండు ముక్కలైంది.
ఆ సమయంలో విమానంలో నుంచి పొగలు వచ్చాయి.వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది విమానం నుంచి వెలువడుతున్న పొగలను ఆర్పివేశారు.అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘటనలో విమానంలోని సిబ్బంది స్పృహలోనే ఉన్నారు.
ఓ పైలెట్ మాత్రం షాక్‌కు గురయ్యాడు.దీంతో వెంటనే విమానంలోని సిబ్బదిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్టు కోస్టా రికా ఫైర్‌ఫైటర్స్ ప్రధాన అధికారి హెక్టర్ చావ్స్ తెలిపారు.
విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్‌పోర్ట్ అధికారులు వివరించారు.

అధికారులు మాట్లాడుతూ.పైలెట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, వారిని దవాఖానకు తరలించామన్నారు.ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించామని చెప్పారు.
దీంతో శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తృటిలో పెనుప్రమాదం తప్పిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.







