సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా కొనసాగుతున్న వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు.అయితే సాధారణ అభిమానులే కాకుండా ఇతర హీరో హీరోయిన్లు కూడా కొంతమందిని వారి అభిమాన హీరోహీరోయిన్లుగా భావిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఎంతో మంది సెలబ్రిటీల పిల్లలకి వాళ్ల తల్లిదండ్రులు కాకుండా వారికంటూ ఫేవరెట్ సెలబ్రిటీలు ఉంటారు.తాజాగా RRRఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇందులో కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన నటనతో ఎంతో మందికి అభిమాన నటుడిగా మారిపోయారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.
వీరికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు అయినా సోషల్ మీడియాలో క్షణాలుగా మారిపోతూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

అభయ్ రామ్ తండ్రి ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ మరొక స్టార్ హీరో తన ఫేవరెట్ అని వెల్లడించారు.మరి ఈ నందమూరి వారసుడుకి ఏ హీరో అంటే ఇష్టం అనే విషయానికి వస్తే.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని అభయ్ రామ్ వెల్లడించారు.ఈ విధంగా ఒక స్టార్ హీరో వారసుడు మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని చెప్పడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







