పిల్లాడి స్కూల్ ఫీజు కోసం ఎపుడైనా 99 లక్షలు కట్టారా? అక్కడ జాయిన్ చేస్తే కట్టి తీరాల్సిందే మరి!

ఒకప్పుడు చదువు అంటే చెప్పలేని విలువ ఉండేది.అలాగే ఉచితంగా లభించేది.

 Have You Ever Paid Rs 99 Lakh For A Child S School Fees , Kid School , Fee , Mo-TeluguStop.com

కానీ, నేడు పరిస్థితి మారింది.ఇప్పుడు చదువంటే మంచి వ్యాపారం.‘ఉన్నతమైన విద్య’ పేరుతో అనేక విద్యాసంస్థలు ఎంతగా దోచుకుంటున్నాయో ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.ఇక ప్రభుత్వాలు కూడా ఇలాంటివారిని నిరోధించడం మాని, ఎంకరేజ్ చేస్తున్న దాఖలాలు మనం చూస్తూ వున్నాం.

అందుకు కారణం మీకు బాగా తెలుసు.ఇక తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్ అవసరాల రీత్యా వారు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు.

ఈ క్రమంలో వారు ఆస్తులు అమ్ముకుని మరీ పిల్లల్ని చదివిస్తున్నారు.

అయితే, అక్కడి వరకు ఒక ఎత్తు.

ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే షాక్ అవుతారు. స్విట్జర్లాండ్‌లోని ఈ స్కూల్లో మీకున్న ఎన్ని ఆస్తులు అమ్ముకున్నా ఇక్కడ మీ పిల్లల్ని చదివించలేరు.

ఎందుకంటే.ఈ స్కూల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది.అయితే అక్కడ కల్పిస్తున్న సదుపాయాలు గురించి తెలిస్తే మాత్రం.‘ఫీజు‘ కొంచెం న్యాయంగానే అనిపిస్తుంది.అవును.ఇక అక్కడి వింతలూ విశేషాలు తెలుసుకుందాం పదండి.అక్కడ జెనీవా సరస్సు అంచును ఆనుకుని ఉన్న ఇన్‌స్టిట్యూట్ లే రోసేకు ఓ ప్రత్యేకమైన చరిత్ర కలదు.

Telugu Educational, Kid School, Lake Geneva, Paul Cornell, Rs, Switzerland-Lates

ఈ స్కూల్‌ను 1880లో పాల్ కార్నల్ అనే వ్యక్తి స్థాపించాడు.దీన్ని రాజుల పాఠశాల అని కూడా అంటారు.స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్, ఈజిప్ట్ రాజు ఫువాడ్ II, బెల్జియం రాజు ఆల్బర్ట్ II, ఇరాన్ షా, అగాఖాన్, గ్రీస్ యువరాణి మేరీ-చంటల్ వంటి వారు ఇక్కడే చదివినట్టు సమాచారం.

అందుకే, ఈ స్కూల్‌కు అంత డిమాండ్ మరి.ఇక్కడ విశాలమైన కాంప్లెక్స్‌తోపాటు ఒలిపింక్-పరిమాణ స్విమ్మింగ్ పూల్స్, టెన్నీస్ కోర్టులు, టెన్నీస్ కోర్టులు కూడా ఉన్నాయి.ఇక్కడ పరిమిత స్థాయిలో మాత్రమే విద్యార్థులను చేర్చుకుంటారు.ప్రతి 430 మంది విద్యార్థులకు 150 మంది ఉపాధ్యాయులు ఉంటారు.ఈ స్కూల్‌కు అంతర్జాతీయ పాఠశాలగా గుర్తింపు ఉంది.కాబట్టి, ఈ స్కూల్‌లో మీ పిల్లలను కూడా చేర్చవచ్చు.

కానీ, విదేశీ విద్యార్థుల కోసం కేవలం 10 శాతం సీట్లు మాత్రమే కేటాయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube