టీఆర్ఎస్ తో పొత్తు పై రాహుల్ క్లారిటీ ? టి.కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు 40 మంది వరకు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ కీలక సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి గురించి,  రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి పూర్తి స్థాయిలో చర్చ జరిగింది.

 Rahul Gandhi Responds To Alliance With Trs Party, Rahul Gandhi, Trs Party, Congr-TeluguStop.com

ఈ సందర్భంగా అసంతృప్త నేతలను బుజ్జగించే విధంగా రాహుల్ వ్యాఖ్యానించారు.అలాగే పొత్తుల అంశాన్ని ఆయన ప్రస్తావించారు.2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ఏం చేయాలనే విషయంపై పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా పొత్తుల అంశంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు .టిఆర్ఎస్ పార్టీ తో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు.
  తెలంగాణ లో టిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలను ధీటుగా ఎదుర్కొని ఎన్నికల్లో గెలవడం పైన పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని రాహుల్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అంతా ఒక కుటుంబమని,  ఇక నుంచి పార్టీ నేతలంతా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం ఒక్కటవ్వాలని సూచించారు.తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాలు, సంస్థాగత వ్యవహారాలపైనా రాహుల్  ఆరా తీశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు.పార్టీలు నాయకుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని,  అంతేగాని మీడియా ముందు ఎవరు మాట్లాడవద్దని సూచించారు.ఏదైనా అభిప్రాయ బేధాలు ఉంటే కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పుకునే విధంగా తాను ఏర్పాటు చేస్తానని, అంతర్గత విభేదాల గురించి బయట చర్చిస్తే ఊరుకునేది లేదని రాహుల్ ఈ సందర్భంగా పార్టీ నాయకులకు సూచించారు.
 

Telugu Aicc, Congress, Jagga, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sanga Mla, Trs-T

ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు అంశాల్ని ప్రస్తావించారు.ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కర్ అని,  ఆయనను ఒక ఏజెన్సీ గా చూడవద్దని,  ఆయన ఏఐసిసి పరిధిలో పని చేస్తారని, అవసరమైనప్పుడు కాంగ్రెస్ నేతల సాయం తీసుకుంటారని రాహుల్ వివరించారు.సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం కనపించింది.సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూర్తిగా రాహుల్ సమావేశం పై సంతృప్తి చెందారు.రాహుల్ చెప్పిన మాటతో తాను సంతృప్తి చెందారని , గతంలో తాను మాట్లాడిన విషయాలను మర్చిపోయానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube