సింహం మాంసం బర్గర్, జీబ్రా సుషీ రోల్స్‌ను త్వరలో నాన్ వెజ్ ప్రియులు ఆరగించనున్నారు.అయితే ఇందుకోసం ఏ జంతువుకు కూడా హాని తలపెట్టరు.
ఈ మాంసమంతా ల్యాబ్‌లోనే తయారవుతుంది. ది ఇండిపెండెంట్ వార్తల ప్రకారం, ఇది హైటెక్ ల్యాబ్‌లో తయారయ్యే మాంసం.
ఫుడ్ టెక్నాలజీ స్టార్టప్ ప్రైవల్ ఫుడ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది.ఈ స్టార్టప్ కంపెనీ ల్యాబ్‌లోనే మాంసాన్ని తయారు చేస్తుంది.
ఇందులో ఏ జంతువుకీ హాని జరగదు.లయన్స్ బర్గర్స్, టైగర్ స్టీక్స్, జీబ్రా సుషీ రోల్స్ ఈ కొత్త ఆహారాల జాబితాలోకి వస్తాయి.
త్వరలో నాన్‌వెజ్ ప్రియులు వీటిని కొనుక్కుని తినగలుగుతారు.
అదేవిధంగా నాన్2వెజ్ ప్రియులు ‘కర్డ్ జిరాఫీ హామ్’, ‘ఎలిఫెంట్ ఆయిల్’ కూడా రుచి చూడగలుగుతారు.
లండన్‌లో ‘మిచెలిన్ స్టార్ కేటగిరీ’లో ఈ వంటకాలను అందించే తొలి రెస్టారెంట్ ఇదని ప్రైమ్‌వల్ ఫుడ్స్ తెలిపింది.త్వరలో ఈ ఆహారాన్ని భారీ స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంచనున్నారు.
ఇది స్థానిక మార్కెట్ సూపర్ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.ల్యాబ్‌లో మాంసాన్ని తయారు చేసేందుకు జంతువులను చంపరు.
ఈ మాంసం నేరుగా జంతు కణాల నుండి తయారవుతుంది.దీన్ని తయారు చేసే తయారీదారులు నిజమైన మాంసంలోని పోషక పదార్ధాలను దీనిలో ఖచ్చితంగా ఉండేలా చూస్తారు.

అయితే ఈ ల్యాబ్ మాంసం ఇంకా పారిశ్రామిక స్థాయిలో తయారు కాలేదు.కాబట్టి దీని ప్రయోజనాలు ఏమిటి? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.అయితే ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం సంప్రదాయ మాంసం కంటే పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తుందని ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాలు చెబుతున్నాయి.గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల కూడా 78 నుంచి 96 శాతం తగ్గుతుంది.
అదే సమయంలో, భూమి వినియోగం 99 శాతం మేరకు తగ్గుతుంది.దీంతోపాటు నీటి వినియోగం కూడా 82 నుంచి 96 శాతానికి తగ్గుతుంది.







