అమెరికాలో దారుణం జరిగింది.75 ఏళ్ల సిక్కు వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.ఈ ఘటనలో ఆయన ముక్కు పగిలిపోయి, తీవ్ర గాయాలు అయ్యాయి.న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.బాధితుడిని నిర్మల్ సింగ్‌గా గుర్తించారు.ఆదివారం మార్నింగ్ వాక్‌కు వెళ్లగా.
స్థానిక గురుద్వారా సమీపంలో నిర్మల్ సింగ్‌పై ఈ దాడి జరిగింది.ఈ ఘటనపై స్థానిక సిక్కు కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
నిర్మల్ సింగ్ రెండు వారాల క్రితం కెనడా నుంచి టూరిస్ట్ వీసాపై అమెరికాకు వచ్చారు.
కాగా.
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో నిందితుడు.
సిక్కు వ్యక్తి తలపాగాను లాగి కిందపడేశాడు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.
అయితే జనవరి 4న ఓ వీడియోను నవజ్యోత్ పాల్ కౌర్ అనే మహిళ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.ఇందులో బాధితుడిని పదే పదే కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తలపాగాను లాగడం కనిపిస్తోంది.
ఈ ఘటన భారత్- అమెరికాలలో సంచలనం సృష్టించింది.దీంతో విచారణ జరపాల్సిందిగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ.ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది.ఈ క్రమంలో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.
అతనిపై విద్వేషపూరిత నేరం కింద అభియోగాలు మోపారు.నిందితుడిని మొహమ్మద్ హస్సనైన్‌గా గుర్తించారు.
ఇకపోతే.ప్రతి ఏడాది ఏప్రిల్ 14ని జాతీయ సిక్కు దినోత్సవంగా గుర్తించాలంటూ భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా డజనుకు పైగా చట్టసభ సభ్యులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.అగ్రరాజ్యం తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెద్ద సంఖ్యలో సిక్కులు స్థిరపడ్డారు.