ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త ఫోన్లు ఇవే.. వీటి ధరలు, స్పెసిఫికేషన్ వివరాలిలా..

ప్రముఖ మొబైల్ మేకింగ్ కంపెనీలు అనునిత్యం సరికొత్త ఫీచర్లతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.అయితే ఈ నెలలో కూడా కొన్ని స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు మొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి.వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

 Brand New Mobiles Prices And Features Releasing In The Month Of April Details,-TeluguStop.com

శాంసంగ్ గెలాక్సీ ఎం53జీ

శాంసంగ్ బ్రాండ్ ఎం సిరీస్ లో భాగంగా ఎప్పటికప్పుడు చక్కటి మొబైల్ ఫోన్స్ తీసుకొస్తోంది.అయితే ఏప్రిల్ లో ఇది శాంసంగ్ గెలాక్సీ ఎం53జీ అనే ఒక మిడ్ రేంజ్ ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది.టెక్ వర్గాల ప్రకారం, ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది.ఈ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో యూజర్లకు బ్రహ్మాండమైన అనుభూతిని అందిస్తుంది.

ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అందించారు.కెమెరాల విషయానికొస్తే, దీనిలో మెయిన్ కెమెరాగా 108 మెగా పిక్సల్ కెమెరా అందించారు.సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు.5000 ఎంఏహెచ్ బ్యాటరీతో నడిచే ఈ ఫోన్ ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్యలో ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం23

Telugu April, Mobiles, Latest, Nord, Poco Gt, Samsung, Samsung Galaxy-General-Te

శాంసంగ్ గెలాక్సీ ఎం23లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 6.6 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.దీని ధర రూ.20 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

వన్‌ప్లస్‌ నార్డ్ 2 సీఈ లైట్

Telugu April, Mobiles, Latest, Nord, Poco Gt, Samsung, Samsung Galaxy-General-Te

వన్‌ప్లస్‌ నార్డ్ 2 సీఈ లైట్ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేటుతో 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.దీని ధర రూ.15 వేల నుంచి రూ.18 వేల లోపు ఉండొచ్చు.

పోకో ఎఫ్ 4జీటీ

Telugu April, Mobiles, Latest, Nord, Poco Gt, Samsung, Samsung Galaxy-General-Te

మీడియా టెక్ డైమెన్సిటీ 1200 ఎమ్టీ 6893 ప్రాసెసర్ తో రన్ అయ్యే పోకో ఎఫ్ 4జీటీ మొబైల్ ని గేమింగ్ ప్రియుల కోసం లాంచ్ చేస్తున్నారు.1120Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 4,560 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్ ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉండొచ్చు.

ఇంకా షియోమీ 12 ప్రో, వివో టీ1 ప్రో 5జీ, రియల్ మీ జీటీ 2 ప్రో వంటి బడ్జెట్ మొబైల్ ఫోన్స్ కూడా ఈ నెలలోనే విడుదల అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube