ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన రోజు నుంచి ఎన్టీఆర్ పాత్ర స్క్రీన్ స్పేస్ కు సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.సినిమాలో చివరి అరగంటలో ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత తగ్గించి చరణ్ పాత్రను హైలెట్ చేయడంపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా చరణ్, తారక్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తర్వాత ఈ గొడవలు మరింత ఎక్కువయ్యాయి.
అయితే భీమ్ పాత్ర విషయంలో వ్యక్తమవుతున్న విమర్శల గురించి స్పందించాలని విజయేంద్ర ప్రసాద్ ను అడగగా కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని ఆయన ప్రశ్నించారు.ఆర్ఆర్ఆర్ పాత్ర విషయంలో జూనియర్ ఎన్టీఆర్ హ్యాపీ అని ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ఆర్ఆర్ఆర్ కు ముందు ఆర్ఆర్ఆర్ తర్వాత అని చెప్పారని విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గురించి ఈ స్థాయిలో చెబుతుంటే అతని పాత్ర తగ్గిందని భావించడం సరి కాదని రాజమౌళి తండ్రి వెల్లడించారు.

గాయాలతో ఉన్న రామ్ కు కట్టు కట్టి భీమ్ పాత్ర కాషాయ వస్త్రాలను, బాణాలను అందిస్తుందని కొమురం భీముడో పాటతో రామ్ ను భీమ్ ఇన్ స్పైర్ చేశాడని భీమ్ ను రామ్ చదువుకునే విధంగా ఇన్ స్పైర్ చేశాడని సినిమాలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని భావించడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు.

చరణ్ ను అల్లూరిలా మార్చింది భీమ్ అయినప్పుడు సినిమాలో ఒకరు తక్కువని మరొకరు ఎక్కువని భావించడంలో అర్థమే లేదని ఆయన చెప్పుకొచ్చారు.ఆర్ఆర్ఆర్ విషయంలో జక్కన్న సమతూకం పాటించలేదని భావించే వాళ్ల విమర్శలకు విజయేంద్ర ప్రసాద్ తన కామెంట్ల ద్వారా సులువుగా చెక్ పెట్టారు.విజయేంద్ర ప్రసాద్ వివరణతో తారక్ ఫ్యాన్స్ కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది.







