దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాహుబలి సినిమా తర్వాత అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ఈ సినిమా తర్వాత అనుష్క ఎలాంటి సినిమా అప్డేట్స్ ఇవ్వకుండా సోషల్ మీడియా, మీడియాకి దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియాకి కూడా దూరంగా ఉండడంతో ఈమె గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇలా అనుష్క గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈమె యు.
వి.క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక తాజాగా ఈ విషయం గురించి యు వి క్రియేషన్స్ బ్యానర్ అప్డేట్ విడుదల చేశారు.జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఈ బ్యానర్లో ఓ సినిమా చేయనుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 4వ తేదీ షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు.

ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి ఏ విధమైనటువంటి టైటిల్ అనుకోలేదు.యు వి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క నవీన్ పోలిశెట్టి జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రారా.కృష్ణయ్య’ దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక అనుష్క యు.వి క్రియేషన్స్ బ్యానర్లో ఇది వరకే మిర్చి, భాగమతి వంటి చిత్రాలలో నటించారు.ఇక అనుష్క తన 48వ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో చేయటం విశేషం.