పూల సువాసన ఎవరినైనా ఇట్టే మైమరపిస్తుంది.అందమైన పూలను ఒకేసారి చూడగానే మనలోని దుఃఖం, ప్రతికూల ఆలోచనలు మనోహరంగా మారిపోయి మనసు ఆనందంతో నిండి పోతుంది.
ఇప్పుడు మనం అలాంటి పూదొటగురించి తెలుసుకుందాం.ఇక్కడ పూలు నలు వైపులా కనిపిస్తాయి.
దుబాయ్‌లో ఉన్న మిరాకిల్ గార్డెన్స్ గురించి ఇప్పుడు తెలుసు కుందాం.మిరాకిల్ గార్డెన్ ప్రపంచం లోనే అత్యంత అందమైన, అతిపెద్ద పూదోట.
ఈ గార్డెన్‌లో 45 లక్షల రకాల పూలు వికసిస్తాయి.దుబాయ్‌లోని మిరాకిల్ గార్డెన్స్ 72 వేల చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఈ గార్డెన్ 14 ఫిబ్రవరి 2013 నుండి సామాన్యుల కోసం తెరిచారు.ఈ గార్డెన్‌లో బాలీవుడ్ చిత్రం ‘అవర్ అన్ ఫినిష్డ్ స్టోరీ’ షూటింగ్ కూడా జరిగింది.ప్రతి సంవత్సరం నవంబర్ మధ్య నుండి మే మధ్య వరకు, సువాసనలతో కూడిన రంగుల పూలు ఇక్కడి కంటికి విందు చేస్తాయి.
72 వేల చ.మీ.లలో వ్యాపించిన ఈ తొట సందర్శకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.వాలెంటైన్స్ డే సందర్భంగా 2013లో దీనిని ప్రారంభించారు.ఇది దుబాయ్ ల్యాండ్ నడిబొడ్డున ఉంది.రంగురంగుల తోరణాలు అల్లుకున్నట్లు కనిపించే ఈ తోట ఇట్టే హాయిని అందిస్తుంది.150 మిలియన్ల పువ్వులతో పూర్తిగా వికసించిన తోటను చూడటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.అక్కడి పూల ఆకారాలు ఎంతో గొప్పగా అనిపిస్తాయి.దుబాయ్ మిరాకిల్ గార్డెన్‌లోని ల్యాండ్‌స్కేపింగ్ 2013లో అతిపెద్ద వర్టికల్ గార్డెన్‌గా, 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద పూల శిల్పంలా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను సంపాదించింది.18-మీటర్ల పూల శిల్పకళ మధ్యప్రాచ్యంలో మొదటి పుష్ప ప్రదర్శన.దాదాపు 1,00,000 మొక్కలు పూలతో దీనిని తయారు చేశారు.