యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.అభిమానుల అంచనాల మేరకు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఊహించని విధంగా భారీగా వసూళ్లు సాధించింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తు దూసుకుపోతోంది.ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.
సక్సెస్ మీట్ లో భాగంగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.ఆర్ఆర్ఆర్ సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేక మైనదని, ఇక తన కెరిర్ గురించి చెప్పుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత,ఆర్ఆర్ఆర్ ముందు అది అందరూ మాట్లాడుకుంటున్నారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నా పరిచయ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి అని అందరూ చెబుతున్నారు, నాకు నిజంగానే ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
ఒక నటుడిగా ఇప్పటి వరకు చేసిన దానికంటే ఈ సినిమా నుంచి ఇంకా ఎంతో శ్రమను కోరుకుంది.
అలాగే ఈ సినిమా నాకు ఒక కొత్త ఆరంభాన్ని అందించింది.

ఈ సినిమాలో పని చేసినందుకు గాను నేను చాలా గర్వపడుతున్నాను అని తెలిపారు ఎన్టీఆర్.సాధారణంగా అభిమాన హీరో ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.కానీ ఈ సినిమాలో నా పరిచయ.
సన్నివేశాలు చూస్తే భీమ్ గురించి ఒక అవగాహన వచ్చే విధంగా దర్శకుడు ఆ షాట్స్ ను తీర్చిదిద్దారు అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.దర్శకుల పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక గొప్ప పరిచయ సన్నివేశం అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
ఇక నా దృష్టిలో సినిమాల గురించి మాట్లాడాలి అంటే మొదట ప్రశంసలు, ఆ తర్వాత రివ్యూలు, ఆ తరువాత బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్.ఎందుకంటే కలెక్షన్లతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు.
కానీ కలెక్షన్లు పెరిగితే నటీనటులకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.







