ప్రముఖ టాలీవుడ్ కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఖత్రా’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బెంగళూరుకు వెళ్లారు.ఇలా బెంగళూరుకు వెళ్ళిన ఈయన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఘాట్ సందర్శించారు.
చిత్ర బృందంతో కలిసి కంఠీరవ స్టేడియం చేరుకొని పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు.పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది మరణించినా నిత్యం ఎంతో మంది అభిమానులు ఆయన సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ తన చిత్ర బృందంతో కలిసి పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు.పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ పునీత్ లేరనే విషయం ఇప్పటికీ తనకు ఎంతో షాకింగ్ గా ఉందని, ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా కన్నడనాట ప్రేక్షకులు, అభిమానుల గుండెలలో నిలిచిపోతారని వర్మ వెల్లడించారు.

ఇక పునీత్ రాజ్ కుమార్ కేవలం నటుడుగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.అలాంటి మంచి మనసు కలిగిన వ్యక్తి మరణించడం ఇప్పటికీ అభిమానులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.







