అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌ను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ అవసరం లేదు.సీఎం సభలోకి వెళ్లే ముందు ఒకటి రెండు నిమిషాలు చాలామంది మాట్లాడుతుంటారు.
ఇలానే అనుకుని వైసీపీలోని ప్రముఖులు ఇద్దరు ఒకరు హైదరాబాద్ నుంచి మరొకరు కర్నూలు నుంచి వచ్చారు.వీరికి జగన్ మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.
ఎందుకంటే వారు రాజ్యసభ స్థానాలు ఆశిస్తున్నారట.అందుకే వారు ఎక్కేమెట్లు, దిగే మెట్లు తప్ప అపాయింట్ మెంట్ ఇవ్వలేదట.
ఈ సందర్భంలోనే ఓ విషయం చర్చకు వచ్చింది.వాళ్లను చూస్తే జాలేస్తోంది సార్… మనసార్ ఏమీ తేల్చడు… అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో చెప్పారట.
ఇది కాస్త మీడియా చెవిన పడింది.ఇది మీడియా మిత్రులు అడగగా ఎప్పటికో గానీ బయటకు రాలేదు.
ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈ విషయం ప్రస్తావించారట.వారిని తిప్పడం.వారేమో సీఎం దగ్గరకు రావాలని ప్రయత్నం చేయడం.రాలేకపోవడం పరిపాటిగా మారిందట.
సభలో జగన్ ప్రసంగం అయ్యే వరకు బయటే వేచి ఉండడం లాంటివి ఈ ఇద్దరి కీలక నేతల మధ్య చర్చకు వచ్చిందట.ఇందులో ఒకరు పీవీపీ అయితే మరొకరు బుట్టా రేణుక ఇద్దరూ రాజ్యసభ సీటు ఆశిస్తున్నారట.
గతంలో కూడా తమకు ఛాన్స్ ఇవ్వాలని ఆశించారట.నేటికీ జగన్ మాత్రం కరుణించలేదని టాక్.
మరి కొద్ది రోజుల్లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
మొత్తంగా వారి విషయంలో సీఎం జగన్ ఏమీ తేల్చడం లేదనే వాదన వస్తోంది.
నిజానికి బుట్టా రేణుక పరిస్థితి ఎలా ఉన్నా ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వవచ్చని టాక్.ఎందుకంటే త్వరలో ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాలీ అవుతున్నాయి.ఇక బీసీ కోటాలో ఆమెకు ఛాన్స్ లభించొచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.మరొకరు పీవీపీ జగన్‌కు సన్నిహితుడు.
అలాగే అక్కినేని నాగార్జునకు కూడా ఆయన మిత్రుడు.ఆయన విషయం కూడా సీఎం జగన్ తేల్చట్లేదు.
ఇదే వైసీపీలో చర్చకు దారితీస్తోంది.ఈ ఇద్దరి ఆశావహులకు జగన్ ఎప్పుడు మోక్షం కలిగిస్తాడో వేచి చూడాలి.







