స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా,దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదు.దేశంలో 75 కోట్ల పైగా ఉన్న బీసీలకు,కేంద్ర బడ్జెట్ లో నామ మాత్రంగానే కేటాయింపులు ఉన్నాయి.
బీసీలు ఏమైనా బిచ్చగాళ్ళు అనుకున్నారా? బీసీ బిల్లు తక్షణమే పార్లమెంట్ లో పెట్టాలి.చట్ట సభల్లో మా వాటా, మా కోటా మాకు కావాల్సిందే.
అగ్రవర్ణాల పేదలకు రాత్రికి రాత్రే రిజర్వేషన్లు ఇచ్చారు.బిసిలకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు.కేంద్రంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం దారుణం.బిసి ప్రధాని ఉన్నా,బిసిలకు న్యాయం జరగడం లేదు.
బీసీల హక్కుల కోసం29 న ఛలో ఢిల్లీ, 30 న అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి సాధించడమే నా జీవిత లక్ష్యం.







