బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి అందరికీ పరిచయమే.బిగ్ బాస్ తర్వాత ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని మంచి సెలబ్రిటీ హోదాను అందుకుంది.
పైగా ప్రస్తుతం ప్రసారమవుతున్న నాన్ స్టాప్ బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అరియానా ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది.
ఇక తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.కేవలం ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.ఇందులోనే తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.
అలా చివరి రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.అంతే కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేవాళ్ళు.దాంతో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.అరియానా ప్రస్తుతం వరుస షో లతో బాగా బిజీగా ఉంటుంది.గత ఏడాది బిగ్బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతున్న నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సీజన్ ప్రారంభమై ఇప్పటికీ నాలుగు వారాలు కాగా ఇందులో పాత కంటెస్టెంట్ లతో పాటు కొత్త కంటెస్టెంట్ కూడా పాల్గొన్నారు.

ఇక వీరి మధ్య పరిచయాలు పెరగడం వాదనలు జరగడం లాంటివి చూస్తూనే ఉన్నాం.కొందరు కంటెస్టెంట్ లు మొదట్లో చాలా ఓవర్ గా చేసినట్లు కనిపించారు.కానీ ఇప్పుడు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు.అలా అరియానా కూడా అందరికీ పరిచయం ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈమె కూడా మొదట్లో అందరికీ బాగా నచ్చింది.కానీ ఈ మధ్య ఈమె ప్రవర్తన ఎవరికి నచ్చడం లేదు.
కారణం ఆమె ప్రతిదానికి చాలా ఓవర్ గా చేస్తుంది అని.ప్రతి ఒక్కరి తో కావాలని గొడవ పడుతుందని ప్రేక్షకులు అంటున్నారు.పైగా తన అభిమానుల నుంచి కూడా ఇటువంటి కామెంట్లు ఎదురవడంతో ఈసారి అరియానా హౌస్ విన్నర్ అవ్వడం డౌటే అని అంటున్నారు.