జగన్ పాలన మూడేళ్లుగా ఆర్ధికంగా దివాలా తీసింది.బ్రాందీ సీసాలు అమ్ముకోగా వచ్చే డబ్బులతో పాలిస్తామని స్వయంగా జగన్ అసెంబ్లీలో అనడం సిగ్గుచేటు.
మంత్రి పదవులకోసం అసెంబ్లీలో భజనలు చేశారు… అసెంబ్లీలో భజన చేసే సంస్ధగా వైసిపి మారిపోయింది రాష్ట్రాన్ని బ్రష్టుపట్టిస్తున్నారు ఖజానా డబ్బులు కూడా దోచేశారు.బడ్జెట్ లో 48 వేల కోట్లకు ఎకౌంటే లేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది అస్ధవ్యస్ధంగా వుంది, రసీదులు కూడా లేవని కాగ్ అధికారులు చెప్పారు.
కేంద్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది.
రాష్ట్ర ప్రజల డబ్బుకు ఎకౌంట్ వుండదా.
ఆ బాధ్యత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు లేదా. వెంటనే కేబినేట్ మీటింగ్ పెట్టాలి 48వేల కోట్లకు సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావు.
రాష్ట్రం పై7లక్షల కోట్లు అప్పు చేశారుఎవరు తీరుస్తారు.చెత్త పన్నువేసిన వాళ్లను చెత్తమంత్రులు అన్నందుకు తనపై కేసులు పెట్టారు మరి 48 వేల కోట్లకు లెక్క చెప్పని వారిని ఏమనాలి.
ప్రతి పైసా ఎకౌంట్ ఫర్ అవ్వాలి.ఎన్టీఆర్ విగ్రహాన్ని లారీతో గుద్దిస్తారా కల్తీ మద్యంతాగి చనిపోయిన వారికుటుంబీకులు ఏడవడంలేదని జగన్ అంటారా వందకోట్ల స్ధలం ఆక్రమిస్తే జగన్ కు తెలీకుండా వుంటుందా కోర్ట్ ఇచ్చిన బెయిల్ మీద తిరిగి సిఎమ్ అయ్యారు జగన్ మళ్లీ కోర్ట్ ను విమర్శిస్తారా.
ఇంకా జగన్ కు రెండు ఏళ్లే పాలన వుంది.ఇప్పటికైనా కళ్లు తెరవాలి ఈనెల 29 కి నందమూరి పార్టీ పెట్టి 40 ఏళ్లు అవుతుంది.
వచ్చేనెల 3 తేదీన విజయవాడలో మహానాడు నిర్వహిస్తున్నారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రెండు సార్లు మంత్రిగా చేశాను ఆస్తిలో సమాన హక్కు, మహిళా విద్యా కు దోహదం చేశారు, స్ధానిక సంస్ధల్లో 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలి.