తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం స్రవంతి బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
అయితే బిగ్ బాస్ షోలో కి ఎంట్రీ ఇచ్చే రోజు స్రవంతి నవరసాలతో ఎంటర్ టైన్ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.ఆ మాటలు పక్కనపెట్టి స్రవంతి బిగ్ బాస్ హౌస్ లో షో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఆట ఇంకా మొదలు పెట్టిన లేదు.
బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, అజయ్ నాకు సప్లై మాస్టర్ల మారి వాళ్లకు సపర్యలు చేస్తూ కనిపిస్తోంది.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్ ల మధ్య పిట్టింగ్ లు పెడుతూ, ఎప్పుడూ అఖిల్, అజయ్ లను అంటిపెట్టుకుని ఉంటుంది.
టాస్క్ లలో భాగంగా అనారోగ్యం పేరు చెప్పి నెట్టుకొస్తోంది.బిగ్ బాస్ కూడా బాగా ఆడే కంటెస్టెంట్స్ లను ఎలిమినేట్ చేస్తూ స్రవంతిని కాపాడుకుంటూ వస్తున్నాడు.ఈ తరఫున పీఆర్ టీమ్ కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు.బిగ్ బాస్ లోకి ఇచ్చే రోజునే తనకు రెండు సార్లు పెళ్లి అయింది అలీ బిగ్ బాస్ నాగార్జున కు చెప్పిన విషయం తెలిసిందే.
ఒకసారి ప్రేమించిన వ్యక్తిని పారిపోయి చేసుకుంటే మరొకసారి ఇంట్లో వాళ్ల ముందు అతని మళ్లీ పెళ్లి చేసుకున్నాను అని తెలిపింది శ్రవంతి.అయితే హౌస్ లో స్రవంతి ఎప్పుడూ పక్క కంటెస్టెంట్ గురించి సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఒక్క ఆట ఆడింది లేదు అంటూ స్రవంతి పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ టూల్స్ పై స్రవంతి భర్త స్పందిస్తూ.ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శ్రవంతి చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.కొత్త లో తనకు ఎవరు తెలియక పోవడంతో చాలా ఇబ్బందులను చేయాల్సి వచ్చింది.ఈ క్రమంలోనే నెగిటివ్ కామెంట్స్ లో చాలా వరకు మంచినే మేము తీసుకునే వాళ్లం అని తెలిపాడు స్రవంతి భర్త.
ఫిట్టింగ్ మాస్టర్ అని ట్రోల్స్ చేస్తున్నారు.కానీ గేమ్ లో ఉన్న వాళ్లకి తెలుసు స్రవంతి అంటే ఏంటో.ఇప్పుడే ఆమె గేమ్ మొదలుపెడుతుంది.అక్కడ వాతావరణం ఇంకా ఆమెకు కొత్తగానే ఉంది.
ఇప్పుడు ఆమె గేమ్ లో పుంజుకుంటోంది అని తెలిపాడు.పెళ్లి విషయానికి వస్తే స్రవంతి నాకు రాసిపెట్టి ఉంది.
ఇద్దరం కలవడం డెస్టిని అని చెప్పవచ్చు.ఎందుకంటే నేనుతెలంగాణ.
ఆమె ఆంధ్ర ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆమెతో పరిచయం అయిన ఆరు నెలల తర్వాత రిలేషన్షిప్ ను మొదలుపెట్టాం అని తెలిపాడు.స్రవంతి ఇంట్లో పెళ్ళి కోసం గారు పెట్టడంతో ఇద్దరము ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారని, పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఇంట్లోకి తల్లిదండ్రులు ఇవ్వలేదని ఆ తర్వాత కొద్ది రోజులకు ఒప్పుకున్నారు అని చెప్పుకొచ్చాడు స్రవంతి భర్త.







