చరణ్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువైనా తారక్ తన నటనతో సెట్ చేశాడుగా.. ఫ్యాన్స్ అభిప్రాయాలు ఏంటంటే?

ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే చరణ్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ అభిమానులలో కొంతమంది ఫీలవుతున్నారు.

 Tarak Perfect For Komuram Bheem Role In Rrr Movie Details, Ntr, Komuram Bheem, J-TeluguStop.com

వాస్తవానికి జక్కన్న ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ ను హైలెట్ చేయగా సెకండాఫ్ లో చరణ్ ను హైలెట్ చేశారు.చరణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండటంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు చరణ్ పాత్రను మరింత హైలెట్ చేసినట్టు కనిపిస్తోంది.

అయితే సినిమాలో చరణ్ పాత్ర నటనలో ఏ స్థాయిలో మెప్పించిందో తారక్ పాత్ర నటనలో అంతకు మించి మెప్పించింది.చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం తారక్ అద్భుతంగా పలికి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తారక్ అద్భుతంగా నటించగా ఆ పాత్రకు తారక్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నిజానికి కొమురం భీమ్ పాత్ర క్రియేట్ చేసిన విధానంలో కొన్ని లోపాలున్నాయి.

కొమురం భీమ్ పాత్రకు చదువు రాకపోవడం, హార్స్ రైడింగ్ రాకపోవడం, క్లైమాక్స్ మినహా మరెక్కడా గన్ ను వాడకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి.అయితే కథనంలో ఉన్న తప్పులను సైతం తారక్ తన నటనతో కవర్ చేశారు.

Telugu Rajamouli, Ntr, Ntr Fans, Perfect, Ram Charan, Rrr, Tarak, Tarakscreen-Mo

ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తారక్ తన స్థాయిని తగ్గించుకుని మరీ నటించారు.అమాయకుడిగా, సందర్భాన్ని బట్టి బలం ఉపయోగించే భీముడిగా తారక్ నటించారు.

తారక్ ఫ్యాన్స్ లో కొందరు తారక్ కు స్క్రీన్ స్పేస్ తగ్గిందని కామెంట్లు చేస్తున్నప్పటికీ తారక్ సినిమా తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు తనదైన నటనతో మ్యాజిక్ చేశారు.క్లైమాక్స్ లో రాజమౌళి తారక్ కు కూడా ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈ తరహా కామెంట్లు కూడా వచ్చి ఉండేవి కావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube