అందరూ ఊహించిన విధంగా ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ డే కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది.నైజాం, సీడెడ్ ఏరియాలలో కలెక్షన్ల విషయంలో ఊహించని రికార్డులను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది.
ఈ రెండు ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయి.నైజాం, సీడెడ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ మొత్తం కలెక్షన్లు 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి.
ఆంధ్రా నుంచి ఈ సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా షేర్ కలెక్షన్లు 135 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఇవి అధికారికంగా ప్రచారంలోకి వస్తున్న కలెక్షన్లు కాగా అనధికారికంగా ఈ సినిమా కలెక్షన్లు 150 కోట్ల రూపాయలకు పైగా ఉండే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షోలకు టికెట్లు భారీ మొత్తానికి విక్రయించారు.
తెలుగు రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు టికెట్లను బ్లాక్ చేయించి మరీ టికెట్లు బ్లాక్ లో అమ్మేలా చేశారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో గతంలో ఏ సినిమాకు జరగని స్థాయిలో బ్లాక్ టికెట్ల విక్రయాలు జరిగాయని తెలుస్తోంది.శనివారం, ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని సమాచారం అందుతోంది.ఫస్ట్ వీకెండ్ సమయానికి ఈ సినిమా 250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

నైజాం ఏరియాలో ఈ సినిమా త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, చరణ్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కింది.దేశవిదేశాల్లో తారక్, చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా ద్వారా మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.







