క్యూఆర్ కోడ్ విషయంలో జరా జాగ్రత్త సుమీ.. లేదంటే మీ డబ్బులు అంతే..!

ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు బాగా ఎక్కువ అయిపోతున్నాయి.అలాగే ఎవరు చూసినగాని ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారు.

 Sbi New Alert About Qr Code Scams Qr Code, Cyber Crime', Latest News, Viral L-TeluguStop.com

ఆన్‌లైన్‌ లో చెల్లింపులు చేయడం చాలా ఈజీగానే ఉంటుంది.అలాగే ఆన్లైన్ లో డబ్బులు బదిలీ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవలిసి వస్తుంది.

ఎందుకంటే ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.లేదంటే హ్యాకర్లు మీ బ్యాంకు బాలన్స్ ను ఖాళీ చెయ్యడం ఖాయం.

అయితే ఈ మధ్య కాలంలో షాపింగ్ మాల్ దగ్గర నుండి చిన్న సైజ్ కిరాణా షాపు వరకు ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్‌ లను ఉపయోగిస్తున్నారు.వాటిని స్కాన్ చేయడం ద్వారా డబ్బులను వాళ్ళ ఖాతాలోకి బదిలీ చేస్తున్నారు.

అయితే ఇకమీదట మీరు క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసేముందు చాలా అప్రమత్తంగా ఉండాలని దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ బ్యాంకు సూచన జారీ చేసింది.ఒకవేళ మీరు కనుక డబ్బులు పొందడం కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే చిక్కుల్లో పడినట్లే అని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ ను అలెర్ట్ చేసింది.

Telugu Cyber, Latest, Qr-Latest News - Telugu

ఎందుకంటే కేవలం క్యూఆర్ కోడ్ తో డబ్బులు మాత్రమే చెల్లిస్తామని, డబ్బులు పొందడానికి కాదని తేల్చి చెప్పేసింది.క్యూఆర్ కోడ్‌ అనేది ఒక క్విక్ రెస్పాన్స్ కోడ్ మాత్రమే.షాప్స్ లో మొబైల్ పేమెంట్లను చేసుకునేందుకు దీనిని ఉపయోగించడం జరుగుతుంది.క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఎవరో తెలియని, ధ్రువీకరణ లేని క్యూఆర్ కోడ్‌లను ఎట్టి పరిస్థితులలో స్కాన్ చెయ్యద్దని స్టేట్ బ్యాంక్ అంటోంది.

మరి రూపాయి, రెండు రూపాయిలకు కూడా ఈ మధ్య క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తున్నారు.అలా చేయడం సరికాదని పేమెంట్ చేసేటప్పుడు, స్కాన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube