ఒకప్పటి యాంకర్.లాస్య పేరు వినగానే చీమ, ఏనుగు జోక్స్ గుర్తొస్తాయి.ఎందుకంటే తాను ఈ జోకులతో ప్రేక్షకులను బాగా అలరించింది.నిజానికి యాంకర్ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లి తెరపై తన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక కొత్తగా చూసే వారికి యాంకర్ అంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా చేసింది లాస్య.
ఈ మధ్యకాలంలో లాస్య యాంకర్ గా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.గతంలో యాంకర్ రవి తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న లాస్య.తన పెళ్లి తర్వాత బిజీ లైఫ్ లో గడుపుతుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా లాస్య తన జోకులతో, కొన్ని విషయాలతో తెగ ముందుంటుంది.
ఈమె బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం.
తన పని ఏంటో తానే చూసుకునేది.
ఇతరులను ఎక్కువగా నొప్పించకుండా గేమ్ లో బాగా పాల్గొనేది.
అంతేకాకుండా తనకు బిగ్ బాస్ వంటలక్క అనే టైటిల్ ను కూడా ఇచ్చాడు.హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తన చేతి వంట రుచి చూపించింది.
లాస్య బుల్లితెరపై షో లలోనే కాకుండా ఎం యల్ ఏ, రాజ మీరు కేక, స్వాతి ఐ లవ్ యు వంటి చిత్రాలలో వెండి తెరపై నటించి తనదైన నటనను కనబరిచింది.

ఆ తరువాత యాంకర్ రవితో రిలేషన్ లో ఉన్నట్టు ఒకప్పుడు బాగా వార్తలు వచ్చాయి.కానీ ఇవన్నీ పుకార్లే అని తర్వాత కు తెలిసాయి.పైగా గతంలో లాస్య యాంకర్ గా దూరం కావడానికి కారణం యాంకర్ రవి నే అని వార్తలు వచ్చాయి.
అలా ఇండస్ట్రీకి దూరంగా ఉండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంజునాథ్ చిల్లాలేను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక లాస్య తన భర్త మంజునాథ్ గురించి, తన ప్రేమ గురించి కొన్నిసార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.తనకు ఓ బాబు కూడా ఉన్నాడు.ఇక అయిదేళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది లాస్య.
పైగా తన భర్త మంజునాథ్ తో కలిసి చాలా షోలలో పాల్గొని బాగా సందడి చేసింది.తను కూడా ఒంటరిగా ఎన్నో షోల్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ప్రస్తుతం పలు షో లలో సందడి చేస్తుంది.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది.అందులో సైలెంట్ గా కారులో కూర్చొని ఏదో తింటున్నట్లుగా కనిపించింది.
పైగా తన భర్త కూడా కనిపించాడు.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.








