తెలంగాణను అవమానించిన ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

తెలంగాణను అవమానించిన ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు కోల్పోయారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ….

 Minister Niranjan Reddy Said That Many Who Insulted Telangana Have Lost Their Po-TeluguStop.com

కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం లేదని తెలిపారు.పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు.

కేంద్రం లేకి మాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు.రా రైస్, బాయిల్డ్ రైస్ అని కన్ఫ్యూజ్ చేయడం తప్ప కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

తాము వడ్లు ఇస్తామని.ఏం చేసుకుంటారనేది కేంద్రం ఇష్టమన్నారు.

కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని.రైతు ల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు.

తాము ఇన్ని సార్లు పియూష్ గోయల్‌ను కలిస్తే.ఒక్కసారి అయినా కిషన్ రెడ్డి వచ్చారా అని ఆయన నిలదీశారు.

కేంద్రం మార్గాలు వెతకాలని…కాలానుగుణంగా మార్పులు రావాలని సూచించారు.ఇథనాల్ ప్రొడక్షన్ 2025 నాటికి 20శాతం పెంచుతామన్నారని.కానీ ఇప్పటి వరకు 5 శాతం దాటలేదని విమర్శించారు.కేంద్రం, రాష్ట్రం మధ్య కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేవన్నారు.28,29న సార్వత్రిక సమ్మె చేస్తామని ప్రకటించారు.ఉగాది తర్వాత ఉధృతమైన ఉధ్యమం చేస్తాం.

ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయిందని చెప్పారు.ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయమన్నారు.

తెలంగాణ రైతులకు బీజేపీ  క్షమాపణ చేప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube