అమెరికాలో తెలుగు వారికోసం “ఆటా అవార్డ్స్”

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అమెరికాలో ఉన్న తెలుగు వారి సంక్షేమం అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన ఆటా ప్రవాసాంధ్రులకు ఎంతో చేరువ అయ్యింది.

 ata Awards For Telugu People In America, American Telugu Association, Ata Awards-TeluguStop.com

తెలుగు బాషాభివ్రుద్ది, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను కొనసాగించడమే కాకుండా అమెరికాలో ఉన్న తెలుగు వారి పిల్లలకు తెలుగు నేర్పేందుకు సహాయసహకారాలను అందిస్తోంది.ముఖ్యంగా తెలుగు వారు ఎంతో ఇష్టంగా జరుపుకునే తెలుగు పండుగలను తెలుగు వారందరితో కలిసి నిర్వహించుకోవడంలో ఆటా ఎప్పుడూ ముందుంటుంది.

కష్ట సమయంలో సాయం చేయడంతో పాటు కరోనా సమయంలో తెలుగు కుటుంబాలకు అలాగే స్థానికంగా ఉండే అమెరికాలోని పేద ప్రజలకు ఎంతో సాయం అందించింది.ఇదిలాఉంటే ఎప్పుడూ వినూత్న కార్యక్రమాలను చేపట్టే ఆటా ఎప్పటిలానే ఆటా అవార్డ్ కు ఆహ్వానం అందిస్తోంది.

అమెరికాలో ఉంటూ అక్కడ సేవా కార్యక్రమాలలో వ్యాపారం, అలాగే వైద్యం, విద్య, లీడర్ షిప్, సామాజిక రంగం, టెక్నాలజీ, మెడికల్, కళలు, సంగీతం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రతీ ఏటా అవార్డులు అందించినట్టుగానే ఈ సారి కూడా ఈ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డ్స్ ప్రధానం చేయనుంది.

పైన పేర్కొనబడిన లేదా ఇతర రంగాలలో సేవలు అందించిన వారెవరైనా ఉంటే వారిని నామినేట్ చేస్తూ దరఖాస్తులు పంపాలని ఆటా తెలిపింది.

అంటే ఏదేని ఒక రంగంలో సేవలు అందించిన వారు మీకు తెలిసిన వారైనా వారి గురించి మీకు ఎలాంటి సమాచారం ఉన్నాసరే వారిని అవార్డ్ కు ఎంపిక చేస్తూ దరఖాస్తులో వారి పేరును చేర్చాలి.అలాగే వారి వ్యక్తిగత వివరాలు కూడా అందులో పేర్కొనాలి.

ఇక నామినేట్ చేస్తున్న వారి వివరాలు కూడా పొందుపరచాలని కోరింది.ఈ ఆటా అవార్డ్స్ కు ఆఖరు తేదీ మే 15 కాగా ఈ లోగా ధరఖాస్తులు తమకు అందాలని ఆటా ఓ ప్రకటనలో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube