టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.సల్మాన్ ఖాన్ ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయినా విషయం విదితమే.
ఇక తాజాగా సల్మాన్ ఖాన్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

మొన్న గురువారంతో సల్మాన్ ఖాన్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో డైరెక్టర్ మోహన్ రాజా ఆయనతో గడిపిన క్షణాలను పంచు కుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు.సల్లూ మైటీ మ్యాన్ అని.స్వీటెస్ట్ పెర్సన్ అని.ఎంతో ఆనందంగా ఉందని.షూటింగ్ చాలా కంఫర్టబుల్ గా మెమరబుల్ గా సాగిందని డైరెక్టర్ తెలిపాడు.ఇదంతా కూడా చిరు ప్రోత్సాహంతోనే జరిగిందని కృతజ్ఞతలు తెలిపాడు.ఈ సెట్ లో ఉన్న ఫుటేజ్ ని ఆయన పంచు కున్నారు.
ఈయన షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది.
ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ .బి .చౌదరి నిర్మిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమా కంటే ముందు ‘ఆచార్య’ సినిమాలో నటించాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలతో పాటు చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా కూడా ప్రకటించాడు.
గాడ్ ఫాదర్ తో పాటు ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు చిరు.







