మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా సినిమాలో “అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు” అనే డైలాగ్ ఉంటుంది.టాలీవుడ్ బాక్సాఫీస్ కు బాహుబలి1, బాహుబలి2 కూడా అలాంటి అద్బుతాలు అనే సంగతి తెలిసిందే.బాహుబలి1 రిలీజ్ కు ముందు ఆ సినిమా ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచుతుందని ఎవరూ ఊహించలేదు.
బాహుబలి2 సినిమా రిలీజైన తర్వాత వేల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఎవరూ అనుకోలేదు.అయితే బాహుబలి సిరీస్ సినిమాలకు అన్నీ సరిగ్గా కుదరడంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి.మరీ భారీస్థాయిలో అంచనాలు పెట్టుకోకుండా ఆ సినిమాలను చూడటం ప్లస్ అయింది.
అయితే బాహుబలి2 తర్వాత జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే బాహుబలి బాహుబలి2 సినిమాలతో పోల్చి చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి.
బాహుబలి బాహుబలే అని ఆ సినిమాతో మరో సినిమాను పోల్చి చూడటం కరెక్ట్ కాదని సాధారణ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.బాహుబలి సిరీస్ కు, ఆర్ఆర్ఆర్ కు జక్కన్న ఒకే విధంగా శ్రమించారని జక్కన్న ప్రతి సినిమాతో ప్రయోగం చేస్తూ విజయాలను అందుకుంటున్నారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.

బాహుబలి సిరీస్ సినిమాలను మనసులోకి రానీయకుండా ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తే ఈ సినిమా మాస్టర్ పీస్ అనిపిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఒకవేళ బాహుబలిలానే ఆర్ఆర్ఆర్ ఉంటే కాపీ అని కొత్తగా జక్కన్న ఏం తీశాడని అంటారని ఆర్ఆర్ఆర్ లా కొత్తగా తెరకెక్కిస్తే మాత్రం బాహుబలిలా లేదంటారని జక్కన్న ఫ్యాన్స్ చెబుతున్నారు.జక్కన్న ఫ్యాన్స్ ఆవేదనలో కూడా అర్థం ఉందని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు.







