స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతారనే సంగతి తెలిసిందే.భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే టాలెంట్ ఉన్న అతికొద్ది మంది దర్శకులలో రాజమౌళి ఒకరు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్, చరణ్ లకు ఆర్ఆర్ఆర్ కథ వల్ల ఈ సినిమాలో నటిస్తున్నారా? లేక జక్కన్న డైరెక్టర్ కాబట్టి నటిస్తున్నారా? అనే ప్రశ్నకు జక్కన్న దర్శకుడు కాబట్టి నటిస్తున్నామని సమాధానం వినిపించింది.
రాజమౌళిపై ఈ ఇద్దరు హీరోలకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో వాళ్ల మాటలను చూస్తే అర్థం అవుతోంది.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రిజల్ట్ తర్వాత తారక్ చాల హ్యాపీగా ఉంటే చరణ్ మాత్రం ఒకింత టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా గుర్తింపు రావడంతో తెగ సంబరపడుతున్నారు.

ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుకు తగిన విధంగా తర్వాత సినిమాల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తారక్ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.తారక్ మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకొని కొత్త సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నారు.కానీ చరణ్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధించడంతో త్వరలో ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది.
2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లలో ఆచార్య మూవీ రిలీజ్ కానుంది.ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధించాల్సిన బాధ్యత చరణ్ పై ఉంది.ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న సినిమా కావడంతో చరణ్ తెగ టెన్షన్ పడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న చరణ్ ఆచార్యతో కూడా మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాల్సి ఉంది.







