రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్,రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్ర గురించి అందరికీ తెలిసిందే.
సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున సినిమా చూసి సినిమా పై వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ రాజమౌళి సినిమా పై స్పందించారు.
ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా సుకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ… మీరు పక్కనే ఉన్న మిమ్మల్ని అందుకోవాలి అంటే మేము పరిగెత్తాలి… మేము ఆకాశంలో ఉన్న మిమ్మల్ని చూడాలంటే తల పైకి ఎత్తాలి.
మీకు మాకు ఒక్కటే తేడా రాజమౌళి సార్.ఇలాంటి సినిమాలు మీరు తీయగలరు మేము చూడగలం… అంటూ సుకుమార్ ట్వీట్ చేశారు.

ఈ విధంగా సుకుమార్ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సుకుమార్ మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ సినిమా గురించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.







