యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అమెరికాలో ఇంత క్రేజా.. అమెరికన్లు సైతం జై అంటూ?

ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి.అలా చరిత్ర సృష్టిస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి.

 Ntr Craze In America Shocks Everyone Know Full Details Inside , Jr Ntr , Tollywo-TeluguStop.com

కొంతమంది ఈ సినిమాకు కావాలనే నెగిటివ్ టాక్ సృష్టిస్తున్నా తారక్, చరణ్ ఈ సినిమాతో ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన రికార్డులను తొక్కుకుంటూ పోతున్నారు.ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్లు అంచనాలను మించి ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. టెంపర్ సినిమా నుంచి తారక్ వరుస విజయాలను అందుకుంటుండగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఖాతాలో మరో సక్సెస్ చేరింది.

అమెరికాలో ప్రీమియర్స్ తోనే 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది.చరణ్ రామరాజు పాత్రలో తారక్ భీమ్ పాత్రలో తమ తడాఖా చూపించారు.

Telugu America, Jr Ntr, Ntr Fans, Rajamouli, Ram Charan, Telugu, Temper, Tollywo

అయితే ఓవర్సీస్ లో ఉన్న తెలుగు ఆడియన్స్ తో పాటు అమెరికన్స్ కు సైతం ఈ సినిమా బాగా నచ్చేసింది.అమెరికన్లు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటంతో పాటు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.తారక్ కు అమెరికన్లలో ఉన్న క్రేజ్ ను చూసి ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతంగా ఉందని అమెరికన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ చాలాకాలం నుంచి కోరుకుంటున్న సక్సెస్ అయితే దక్కింది.ఎన్టీఆర్ ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించి ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తున్న ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా చేశారు.

కొమరం భీముడో సాంగ్ లో తారక్ ను చూసిన ఫ్యాన్స్ తారక్ తప్ప మరెవరూ ఈ పాత్రకు ఈ స్థాయిలో న్యాయం చేయలేరని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube