తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.షో నుండి ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయి పోయారు.
మొదటి వారంలో ముమైత్ ఖాన్.రెండవ వారంలో శ్రీ రాపాక.
మూడవ వారంలో రేడియో జాకీ చైతూ ఎలిమినేట్ అయిపోవడంతో మరింత రసకందాయంలో పడింది అనడంలో సందేహం లేదు.ఇక గత సీజన్ల ను చూసి కంటెస్టెంట్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.
ఏ విధంగా టాస్క్ లో పాల్గొంటే ఎక్కువ మార్కులు పడతాయి.ప్రేక్షకుల నుండి ఓట్లు దక్కుతాయి అనే విషయాన్ని పరిశీలించి మరీ వారు అనూహ్యంగా అలాగే ప్రవర్తిస్తున్నారు.
తెలుగు బిగ్బాస్ సీజన్ లు అన్నింటిలో కూడా లవ్ ట్రాక్ నడిపిన వారికి మంచి ఆదరణ దక్కింది.లవ్ ట్రాక్ నడిపించిన వారు ఎక్కువ వారాలు హౌస్ లో ఉన్న దాఖలాలు ఉన్నాయి.
అందుకే అఖిల్ తో ఈ సీజన్లో అషు రెడ్డి లవ్ ట్రాక్ నడిపించేందుకు సిద్ధమైంది.
వీరిద్దరి లవ్ ట్రాక్ ప్రస్తుతం అందరికీ ఆసక్తిగా మారింది.
ఇద్దరిని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నట్లు గా మాట్లాడుకుంటారు.ఒకరి గురించి మరొకరు చాలా శ్రద్ద తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.
అందుకే వీరిద్దరి జంట కు మంచి గుర్తింపు దక్కింది అనడం లో సందేహం లేదు.ఈ సీజన్ ఫైనల్ వరకు అఖిల్ ఉంటాడు అని ఒక నమ్మకం అయితే ఉంది.

అందుకే ఆయన ని పట్టుకుని ఈ సీజన్లో నెట్టుకు రావాలని అషు రెడ్డి భావిస్తుందేమో అని కొందరు కామెంట్ చేసుకుంటే.మరి కొందరు మాత్రం అషు కూడా ఖచ్చితంగా సోలో గానే మంచి గుర్తింపు దక్కించుకుని చివరి వరకు కొనసాగుతుంది.అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి బిగ్బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగడం లో వీరి లవ్ స్టోరీ కీలకంగా కూడా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఎపిసోడ్లను అనూహ్యంగా వీరికి సంబంధించిన లవ్ ట్రాక్ మరింతగా పండేలా ఒక స్కిట్ పడింది.ఆ స్కిట్ లో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లుగా వెల్లడించారు.







