గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో మంది అభిమానులు సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25వ తేదీ విడుదల కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతున్నాయి.
సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉన్నా కూడా అభిమానులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ సినిమాను థియేటర్ లో చూడాలని పెద్దఎత్తున అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.
ఇక ఈ సినిమా విడుదల కాకుండానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్దఎత్తున జరిగింది.
ఇకపోతే మేకర్స్ ఈ సినిమా విడుదల మార్చి 25వ తేదీకి వాయిదా వేయడమే మంచిదయిందని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ఈ సినిమా కనుక ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 7వ తేదీ విడుదల అయి ఉంటే ఈ స్థాయిలో బిజినెస్ జరిగి ఉండేది కాదని, కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయిందని పలువురు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

ఆ సమయంలో కరోనా అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు కూడా పెద్దగా థియేటర్లకు వచ్చేవారు కాదు.అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచకపోవడం వల్ల ఈ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గిపోయే ఉండేవి.ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయడమే మంచి జరిగిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో 100% ఆక్యుపెన్సీతో పాటు ఏపీలో సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగాయి అలాగే ఇతర దేశాలలో కూడా పెద్ద సినిమాల విడుదలకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉండడంతో ఈ సినిమా ఇప్పుడు విడుదల అవడమే మంచిదని అభిమానులు భావిస్తున్నారు.







