దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కన్నా రాజకీయాలపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.త్వరలోనే ఆయన కెసిఆర్ చెంతన చేరబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఆయనతో కలిసి ఢిల్లీలో కనిపించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై యుద్ధం చేయడానికి తాను ఎవరితోనైనా కలుస్తానని బహిరంగంగా వెల్లడించారు.
ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ కి వీలు దొరికినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తూ ఉంటాడు.
తాజాగా ఆయన ఆరోగ్యం గురించి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు.
పాటిల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని, మిగిలిన ఇరవై రెండు గంటలు దేశం కోసం పని చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ దయచేసి కొంచెం కామన్సెన్స్ వాడండి 24 గంటలలో కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు అంటే నరేంద్ర మోడీఇన్సోమ్నియా అనే జబ్బుతో బాధపడుతున్నారు.నిద్ర లేకపోవడం కూడా ఒక రోగం అంటూ ప్రకాష్ రాజ్ నరేంద్ర మోడీ పై సెటైర్ వేశారు.అలాంటి రోగంతో బాధపడుతున్న మీ నాయకుడికి వెంటనే చికిత్స చేయించండి అంటూ ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ నరేంద్ర మోడీ పై ఆరోగ్యం పై కామెంట్స్ చేశారు.








