వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మొన్నటిదాకా సైలెంట్ గానే ఉన్నాడు.జగన్ మనసులో ఏముందో మంత్రులు తెలుసుకుని విపక్షాలను ఏకిపారేశారు.
కొన్ని సందర్భాల్లో అవి వివాదాలకు కూడా దారితీసిన విషయం విధితమే.అయినా వైసీపీ పొలిటికల్ ఫోకస్ ఏంటనేది ఇప్పటి వరకు మంత్రులే చెప్పు కుంటూ వచ్చారు.
తాజాగా రాజకీయ పరిణామాలు చూస్తుంటే జగన్ జోరు పెంచినట్టు కనిపిస్తోంది.పొలిటికల్‌గా ఆయన గేర్ మారుస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.మూడేండ్ల పాలన సమీపిస్తున్న సందర్భంగా తన దూకుడు సరిపోదని, మరింత దూకుడు పెంచాలన్నట్టు జగన్ తీరు ఉంది.ఇక మౌనంగా ఉంటే పొలిటికల్‌గా దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.
ఇదే భావించి వీలు దొరికినప్పుడల్లా రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే బడ్జెట్ సమావేశంలో అనేకమార్లు బుబుపై ఘాటు విమర్శలు చేశారు.
తన పంచ్ డైలాగులతో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు.తాజాగా పోలవరంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ఆయన మనసులోని విషయాలు దాయలేక బాబుపై ఛాలెంజ్ విసిరారు.
కుప్పంతో సహా బాబును ఓడించి తీరుతామని బిగ్ చాలెంజ్ చేయడం చర్చకు దారితీస్తోంది.అంతకుముందు కూడా వైసీఎల్పీ సమావేశంలో కూడా చంద్రబాబుని నథింగ్ అంటూనే ఆయన ఇగోను టచ్ చేసే ప్రయత్నం చేశారు.
అంతా బాబుతోనే వైసీపీ రాజకీయం ఉందన్నట్టు వ్యవహరించడం గమనార్హం.

మొత్తంగా ఏపీలో రాజకీయం మారుతోంది.సొత పార్టీ లోనూ కట్టు బాట్లను ఖాతరు చేసేవారు తగ్గుతారు.మరోవైపు అధికార వర్గాల్లో గతంలో మాదిరిగా పరిస్థితులు ఉండవు.
ఎన్నికల వేడి రగిలే కొద్ది అధికారం తగ్గుతూ వస్తుంది.ఈ నేపథ్యంలో ప్రత్యర్థులకు హుషార్ వస్తుంది.
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ఫుల్ జోష్‌తో కనిపించారు.వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలో కొస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఇక టీడీపీ పరంగా మహానాడు ఉంది.ఈ లెక్కన ప్రత్యర్థి పార్టీలు సందడి చేస్తుంటే.
వైసీపీ, జగన్ మాత్రం సైలెంటగ్‌గా ఉండం ట్రెండ్‌ని సెట్ చేస్తాయనడంలో సందేహం లేదు.ఈ నేపథ్యంలోనే జగన్ తన మౌనం వీడి గళం విప్పుతున్నారని టాక్.
గతంలో చంద్రబాబు పేరు ఎత్తడానికే జగన్ ఇష్టపడేవారు కాదు.కానీ, విద్యా దీవెనలో గతానికి భిన్నంగా బాబు గురించి ఎక్కువగా మాట్లాడారు.
గత ప్రభుత్వం ఏమీ చేయలేదని పదే పదే చెప్పుకొచ్చారు.మొత్తంగా విపక్షం అధికార పక్షాన్ని ఎన్నికల మూడ్ లోకి తెచ్చిందనే చెప్పాలి.
కాగా తమ జోరు పెంచడమే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారు.







