కల్తీ నాటు సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేబ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా ఆరో రోజూ టీడీపీ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది.కోడికత్తి ఫెక్, సారా మరణాలు నిజం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
బాబాయి గుండెపోటు ఫేక్, కల్తీ మద్యం నిజం అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.కల్తీ నాటుసారాతో పాటు జె బ్రాండ్‌తో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు.
రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని మండిపడ్డారు.కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది.







