నూనె విక్రయాలలో అక్రమాలు జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు ఏపీ ప్రభుత్వం వార్నింగ్..!!

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య దాదాపు 20 రోజులకు పైగా యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంటనూనెలకు భారీ డిమాండ్ పెరిగింది.ముఖ్యంగా భారతదేశంలో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

 Ap Government Warns Of Irregularities In Oil Sales Ap Government, Russia, Ukrain-TeluguStop.com

ఈ పరిణామంతో చాలా చోట్ల వ్యాపారస్తులు ఇదే సరైన టైం అనుకొని.ప్యాకెట్ పై రేట్ల కంటే మరీ ఎక్కువగా అమ్మేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు.

ఇటువంటి పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది.ఏ వ్యాపారస్తుడు అయినా వంట నూనె ధరల ప్యాకెట్ పై ఉన్న ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ఏపీ విజిలెన్స్ అధికారులు.పాత స్టాక్ విషయంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించ కూడదని స్పష్టం చేశారు.

వంటనూనె విక్రయాల విషయంలో అక్రమాలకు పాల్పడితే బైండోవర్ కేసులు పెడతామని కూడా హెచ్చరించారు.బ్లాక్ మార్కెటింగ్ పై దాడులు కొనసాగుతాయని రాష్ట్రంలో ప్రజలు వంటనూనె అక్రమాలపై 9440906254 కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అని నంబర్ అందుబాటులోకి తెచ్చారు.

విజిలెన్స్‌ అధికారి శంఖబ్రత బాగ్చి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు, దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో క్రమాలు బయట పడ్డ చోట 59 కేసులు 889 కేసులను లీగల్ మెట్రాలజీ అధికారులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube