సర్కారు వారి పాట సినిమాలో సితార పాత్ర ఏంటీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా పరశురాం దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా నుండి రెండో పాట ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

 Sitara In Mahesh Babu Sarkaru Vaari Pata , Sitara, Mahesh Babu , Sarkaru Vaari-TeluguStop.com

ఈ రెండవ పాటలో కీర్తి సురేష్ కాకుండా మహేష్ బాబు గారాల పట్టి సూపర్ ప్రిన్స్‌ సితార కనిపించడం అందరికీ ఆశ్చర్యం గా ఉంది.సినిమా లో సితార కనిపించబోతుంది అంటూ కొన్ని నెలల క్రితం మీడియా లో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి.

ఆ విషయాన్ని చాలా మంది కొట్టి పారేశారు.కానీ తాజాగా ఆమె కనిపించడం తో కచ్చితం గా సినిమా లో ఆమె ఉండబోతుంది అంటూ అంత నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

పాటలో ఉన్నంత మాత్రాన సినిమా లో కనిపించాలని ఏమీ లేదు.కానీ అసలు విషయం ఏంటంటే పాట కోసమే సితార ను తీసుకురావాల్సిన అవసరం లేదు.

మహేష్ బాబుతో సితార కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయి.కనుక ఆమెను పాట లో ఉంచారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మహేష్ బాబు కూతురు సితార ఎంట్రీ కన్ఫర్మ్ అవ్వడం తో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సర్కారు వారి పాట కు సంబంధించిన టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేస్తే.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Sitara, Tollywood-Movie

అందులో సితార ఉంటే అప్పుడు సినిమా లో సీతూ పాప ఉన్నట్లుగా మరింత నమ్మకం కలుగుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా లో సితార కనిపించబోతుంది అనే వార్త సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.మహేష్ బాబు కీర్తి సురేష్ మొదటి సారి కలిసి నటిస్తున్న సినిమా కావడం తో అంచనాలు భారీగా ఉన్నాయి ఈ అంచనాలు సితార నటిస్తుంది అనడంతో మరింతగా పెరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube